Vacancies In Uranium Corporation : యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఒప్పంద ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయసు 45 ఏళ్లకు మించకుండా ఉండాలి.

Vacancies In Uranium Corporation : యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఒప్పంద ఖాళీల భర్తీ

Filling up of contract vacancies in Uranium Corporation of India Limited

Updated On : December 16, 2022 / 8:04 PM IST

Vacancies In Uranium Corporation : భారత ప్రభుత్వ అటామిక్‌ ఎనర్జీ మంత్రిత్వశాఖకు చెందిన జార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 11 ఫోర్‌మ్యాన్‌ (మెకానికల్‌) పోస్టుల భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయసు 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.46,020ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఆసక్తి కలిగిన వారు జనవరి 16, 2023వ తేదీన ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూకి హాజరు కావాల్సిన చిరునామా ; ది కాన్ఫరెన్స్ రూమ్ ఆఫ్ న్యూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్-జాదుగూడ, యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, PO: జాదుగూడ మైన్స్, జిల్లా. సింగ్భూమ్ (తూర్పు), జార్ఖండ్ – 832102. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://ucil.gov.in/ పరిశీలించగలరు.