SSC JHT 2023 Notification
Job Vacancies : కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీ చేపట్టనుంది.
READ ALSO : Eating Corn : కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేసే మొక్కజొన్న
సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కన్‌జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్, ఏఐఆర్ హెడ్ క్వార్టర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ తదితర విభాగాల్లో మొత్తం 307 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
READ ALSO : Fish Farming : మంచి దిగుబడులు సాధించాలంటే చేపల చెరువుల్లో చేపట్టాల్సిన మెళకువలు
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు మాస్టర్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్) లో ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి. ట్రాన్స్‌లేషన్(హిందీ/ఇంగ్లిష్) డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలో రెండేళ్ల ట్రాన్స్‌లేషన్ అనుభవం ఉండాలి.
READ ALSO : Pest Control : కూరగాయ తోటలల్లో పండుఈగ ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు మాస్టర్ డిగ్రీతో పాటు మూడేళ్ల ట్రాన్స్‌లేషన్ అనుభవం ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ లేదా పీజీ (హిందీ/ఇంగ్లిష్) అర్హత కలిగి ఉండలి. అలాగే అనుభవం కూడా ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా చదివి ఉండాలి. అలాగే కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీనియర్ సెకండరీ స్థాయిలో రెండేళ్లకు తగ్గకుండా హిందీ టీచింగ్‌లో అనుభవం ఉండాలి. వయసు తప్పనిసరిగా 30 ఏళ్లకు మించరాదు.
READ ALSO : India: AIలో దూసుకుపోతున్న భారత్.. ఆరేళ్లలో 14 రెట్లు ప్రతిభ పెరిగిందట
రాతపరీక్ష , డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 12, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.ssc.nic.in పరిశీలించగలరు.