ఇంటర్, డిగ్రీ అర్హతతో ఫ్లిప్ కార్ట్ లో 70 వేల ఉద్యోగాలు

ప్రముఖ ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’సేల్ సందర్భంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఫెస్టివల్ సీజన్‌లో నిర్వహించబోయే బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం కొత్తగా 70వేల ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పిస్తున్నట్లు తెలిపింది. ప్రతీ ఏటా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్న విషయం విధితమే.
ఫ్లిప్ కార్టు ‘బిగ్ బిలియన్ డేస్’ అనేది అమెజాన్ ప్రైమ్ డే తరహలో నిర్వహించబడింది. ఇది సంవత్సరంలో అతి పెద్ద అమ్మకాలను సాధించింది. ఈ సేల్ సాధారణంగా అక్టోబర్ నెలలో ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఇతర సేల్స్ తో పోలీస్తే ఫ్లిప్ కార్టు లో బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భారీగా ఆఫర్లు ఉంటాయి. ఈ సేల్ ద్వారా 50వేల చిన్న, పెద్ద కిరణా షాపులను సైన్ అప్ చేస్తామని ఫ్లిప్ కార్టు సంస్థ తెలిపింది.
అంతేకాకుండా సప్లయ్ చెయిన్ లో భాగంగా డెలవరీ ఎగ్జిక్యూటివ్స్, పిక్కర్స్, ప్యాకర్స్, సార్టర్స్ లాంటి 70వేల పోస్టుల్ని భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఉద్యోగులకు మాత్రమే కాకుండా సెల్లర్ పార్ట్‌నర్స్, ఎంఎస్ఎంఈలు, కళాకారులకు కూడా ప్యాకేజింగ్, వేర్‌హౌజ్ మేనేజ్‌మెంట్‌పై కూడా శిక్షణ ఇవ్వనుంది ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్ సహకారం తీసుకుంటోంది. వీటిలో చాలా పోస్టులకు ఇంటర్, డిగ్రీ అర్హత ఉంటే చాలు. ఉద్యోగులను నియమించుకున్న తర్వాత వారికి కస్టమర్ సర్వీస్, డెలివరీ, ఇన్‌స్టాలేషన్, సేఫ్టీ, శానిటైజేషన్‌తో పాటు పీఓఎస్ మెషీన్లు, స్కానర్లు, మొబైల్ అప్లికేషన్లను ఆపరేట్ చేయడం లాంటి అంశాల్లో ట్రైనింగ్ ఇవ్వనుంది.