GATE 2024 Final Answer Key : గేట్-2024 ఫైనల్ ఆన్సర్ కీ రిలీజ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. ఈ నెల 16నే ఫలితాలు!

GATE 2024 Final Answer Key : గేట్-2024 పరీక్షకు సంబంధించి ఫైనల్ ఆన్సర్ కీ విడుదల అయింది. ఈ పరీక్ష ఫలితాలను షెడ్యూల్ ప్రకారమే మార్చి 16న వెల్లడి కానున్నాయి.

GATE 2024 Final Answer Key Released Today, Check Full Details

GATE 2024 Final Answer Key : ప్రముఖ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు ( IISc బెంగళూరు) గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2024 ఫైనల్ ఆన్సర్ కీని శుక్రవారం (మార్చి 15) విడుదల చేసింది. ఈ గేట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (gate2024.iisc.ac.in) నుంచి తమ ఫైనల్ కీలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గేట్ 2024 అన్ని పరీక్ష పేపర్‌ల ఫైనల్ ఆన్సర్ కీలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. గేటల్ 2024 పరీక్ష ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ గేట్ పరీక్షా పత్రాలు ఇంగ్లీష్ లాంగ్వేజీలో అందించారు.

Read Also : TS TET 2024 : గుడ్ న్యూస్.. ‘టెట్’ నోటిఫికేషన్ విడుదల.. డీఎస్సీ పరీక్ష తేదీలు కూడా..!

మల్టీపుల్ ఆప్షన్ ప్రశ్నలు (MCQ), మల్టీపుల్ ఆప్షన్ ప్రశ్నలు (MSQ)/లేదా న్యూమరల్ ఆన్సర్ టైప్ (NAT) ప్రశ్నలు ఉన్నాయి. ఈ పరీక్ష మొత్తం 200 నగరాల్లో రెండు సెషన్లలో ఉదయం 9.30 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరిగింది. గేట్ 20224 ఆన్సర్ కీ ఫిబ్రవరి 19, 2024న విడుదల అయింది. అయితే, ఈ పరీక్షకు సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే దాఖలు చేసేందుకు ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 25 వరకు సమయం అందించింది. షెడ్యూల్ ప్రకారం.. గేట్ రిజల్ట్స్ స్కోర్‌కార్డ్ మార్చి 23, 2024న విడుదల కానుంది.

గేట్ 2024 ఫలితాల తేదీ, సమయం వివరాలివే :
అధికారిక షెడ్యూల్ ప్రకారం.. గేట్ 2024 ఫలితాలు మార్చి 16న వెల్లడి కానున్నాయి. అయితే, గేట్ ఫలితాలను విడుదల చేయడానికి ఇన్‌స్టిట్యూట్ నిర్దిష్ట టైమ్‌లైన్‌ను షేర్ చేయలేదు. అభ్యర్థులు తాజా అప్‌డేట్స్ కోసం గేట్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని సూచించారు.

గేట్ 2024 ఫైనల్ కీని డౌన్‌లోడ్ చేయడం ఎలా? :

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ (gate2024.iisc.ac.in)కి వెళ్లండి.
  • హోమ్‌పేజీలో మాస్టర్ ప్రశ్నపత్రాలు, ఆన్సర్ కీ లింక్‌పై క్లిక్ చేయండి
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • క్వశ్చన్ పేపర్, ఆన్సర్ కీపై క్లిక్ చేయండి.
  • ఫైనల్ ఆన్సర్ డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం హార్డ్ కాపీ మీ దగ్గర ఉంచుకోండి.

Read Also : WhatsApp Profile Pictures : ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఇతర వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోలను స్ర్కీన్‌షాట్ తీయడం కుదరదు!