డోంట్ మిస్ : జనరల్ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ కళాశాలల్లో 2019-20 విద్యా సంవత్సరానికిగానూ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ(GNM) ట్రైనింగ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియెట్ పాసైన అభ్యర్ధులు అర్హులు.
వయసు:
అభ్యర్ధులకు జూలై 1, 2019 నాటికి 17వ సంవత్సరలు ఉండాలి, 35 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
అభ్యర్ధుల మెరిట్ ఆధారితంగా జరుగుతుంది. అభ్యర్థి ఇంటర్ గ్రూపు సబ్జెక్టుల్లో పొందిన ఉత్తీర్ణతను పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తు ఫీజు:
అభ్యర్ధులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: ప్రభుత్వ కళాశాలలకు సెప్టెంబర్ 25, ప్రైవేటు కళాశాలలకు అక్టోబర్ 17.
దరఖాస్తు చివరితేది:
ప్రభుత్వ కళాశాలలకు సెప్టెంబర్ 30, ప్రైవేటు కళాశాలలకు అక్టోబరు 17.
తరగతులు ప్రారంభం: నవంబర్ 1, 2019.
Read Also: దరఖాస్తు చేసుకోండి: BELలో ఇంజనీర్ ఉద్యోగాల