దరఖాస్తు చేసుకోండి: GAT-2020 నోటిఫికేషన్ రిలీజ్

గీతం యూనివర్సిటీ ఇంజినీరింగ్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశపరీక్ష GAT-2020 షెడ్యూలును విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 11 నుంచి 21 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ శివరామకృష్ణ గురువారం (నవంబరు 14) ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రవేశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తులను యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకుల్లో అందుబాటులో ఉంచనునున్నట్లు ఆయన తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 50 ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాట్లు చేయనున్నామని వెల్లడించారు.
ఎంపిక విధానం:
అభ్యర్ధులను ప్రవేశపరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోడానికి రూ.800 చెల్లించాల్సి ఉంటుంది.
Read Also.. సీనియర్ స్టెనోగ్రాఫర్.. అడ్మిట్ కార్డు రిలీజ్