ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 1 నుంచి 20 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 1 నుంచి 19 వరకు ఇంటర్ ప్రథమ, 3 నుంచి 20 వరకూ ద్వితీయ సంవత్సర పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.
అలాగే, మార్చి 3 నుంచి 15 వరకు ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంగలల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన కనీస సౌకర్యాలు కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫిర్యాదులు స్వీకరణకు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ నంబరు 1800 425 1531ను ఇచ్చారు. జిల్లా కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలి. పరీక్షల ఏర్పాట్లను సీఎస్ విజాయనంద్ సమీక్షించారు. కాగా, ఏపీలో ఇంటర్ పరీక్షలను 1,058,893 మంది విద్యార్థులు రాయాల్సి ఉంది. మొత్తం 1,535 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకునేదెలా?