LRS: గుడ్‌న్యూస్‌.. ఎల్‌ఆర్‌ఎస్‌కు అప్లై చేసుకుంటున్నారా? తక్కువ ధరకు.. పెండింగులో ఉన్న వాటికి కూడా..

దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నవారు వచ్చేనెల 31లోగా అప్లై చేసుకుంటే డిస్కౌంట్ దక్కుతుంది.

LRS: గుడ్‌న్యూస్‌.. ఎల్‌ఆర్‌ఎస్‌కు అప్లై చేసుకుంటున్నారా? తక్కువ ధరకు.. పెండింగులో ఉన్న వాటికి కూడా..

LRS

Updated On : February 20, 2025 / 5:05 PM IST

ఎల్‌ఆర్‌ఎస్‌కు అప్లై చేసుకోవాలనుకుంటున్న వారికి తెలంగాణ సర్కారు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో నాలుగేళ్ల నుంచి పెండింగులో ఉంటున్న ప్లాట్లకు సైతం రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు సర్కారు అంగీకరించింది.

అంతేకాదు, ఎల్‌ఆర్‌ఎస్‌ రుసులో కూడా 25 శాతం డిస్కౌంట్‌ ఇస్తామని ప్రకటించింది. దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నవారు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులోకి వెళ్లి ఫీజును ఇచ్చి, రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని సర్కారు చెప్పింది.

వచ్చే నెల 31లోగా రిజిస్ట్రేషన్లను చేసుకుంటేనే ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుములో డిస్కౌంట్‌ దక్కుతుంది. ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని అమలు చేసేందుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Also Read: ఏం పవన్.. ఏంటి సంగతి? హిమాలయాలకు వెళ్తున్నారా?: పవన్‌తో మోదీ ఆసక్తికర సంభాషణ

ఇప్పటివరకు ఉన్న పెండింగ్‌ దరఖాస్తులను కూడా వేగంగా పరిష్కరించాలని చెప్పింది. గతంలో అనుమతి లేని లే అవుట్ల విషంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లను సర్కారు నిషేధించింది. ఈ కారణంతో వాటిని కొన్న వారు నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోలేకపోతున్నారు.

ఇప్పుడు అటువంటి వారంతా ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. లే అవుట్‌లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్‌ అయిఉంటే, అందులోని మిగతా 90 శాతం ప్లాట్లు రిజిస్టరు కాపోతే ఎల్‌ఆర్‌ఎస్‌ కింద వాటి క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు.

అలాగే, వాటికి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే ఆయా ప్లాట్లను కొని, విక్రయ దస్తావేజు ఉన్నవారు వచ్చేనెల 31లోగా అప్లై చేసుకుంటే డిస్కౌంట్ దక్కుతుంది. చాలామంది నాలుగేళ్లుగా ఎల్‌ఆర్‌ఎస్‌ల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. అటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది.