Modi-Pawan: ఏం పవన్.. ఏంటి సంగతి? హిమాలయాలకు వెళ్తున్నారా?: పవన్‌తో మోదీ ఆసక్తికర సంభాషణ

ప్రధాని తనపై చాలాసార్లు జోకులు వేస్తుంటారని పవన్ చెప్పారు.

Modi-Pawan: ఏం పవన్.. ఏంటి సంగతి? హిమాలయాలకు వెళ్తున్నారా?: పవన్‌తో మోదీ ఆసక్తికర సంభాషణ

Updated On : February 20, 2025 / 3:56 PM IST

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీనటుడు పవన్ కల్యాణ్ వస్త్రధారణ చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్స్ వేశారు. “మీరు హిమాలయాలకు వెళ్తున్నారా” అని పవన్‌ను సరదాగా అడిగారు మోదీ.

ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ హాజరయ్యారు. వేదిక పైకి వచ్చే సమయంలో ఎన్డీఏ నేతలందరినీ మోదీ పలకరించారు. ప్రత్యేక వస్త్రధారణలో ఉన్న పవన్‌ను చూసి కొద్దిసేపు ముచ్చటించారు. మోదీ ఏం మాట్లాడారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా పవన్ వివరాలు వెల్లడించారు.

Also Read: లైలా ఫ్లాప్.. ఫ్యాన్స్‌కు విశ్వక్ సేన్ లెటర్.. క్లాస్, మాస్ ఏదైనా సరే ఇకపై..

ప్రధాని తనపై చాలాసార్లు జోకులు వేస్తుంటారని పవన్ చెప్పారు. ఇవాళ తన వస్త్రధారణ చూసిన తర్వాత అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళుతున్నవా అని ప్రధాని మోదీ అన్నారని తెలిపారు. అలాంటిదేమీ లేదని తాను చెప్పానని అన్నారు. చేయాల్సింది చాలా ఉంది అని పవన్ కల్యాణ్ తెలిపారు.

మరోవైపు, ఎన్డీయే సమావేశంలో ప్రధాన మంత్రి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలైనా సరే ఎన్డీఏ దీటుగా ఎదుర్కొంటుందని తెలిపారు. అన్ని ఎన్నికల్లో ఎన్డీఏ ఒక శక్తిగా నిలబడుతుందని అన్నారు. బిహార్ అయినా బెంగాల్ అయినా ఎక్కడా తగ్గేది లేదని అన్నారు.