ChatGPT: చాట్‌జీపీటీతో ఇలా రెజ్యూమ్‌ క్రియేట్ చేసుకోండి.. ఇంటర్వ్యూ షార్ట్‌లిస్ట్‌లో మీ పేరును చూసుకోండి..

ఉద్యోగం పొందడానికి మొదటి మెట్టు ఇదే. ఇటువంటి రెజ్యూమ్‌ను చాట్‌జీపీటీ సాయంతో చాలా పర్ఫెక్ట్‌గా రూపొందించుకోవచ్చు.

ChatGPT

Open AI: చాట్‌జీపీటీతో చాలా సులువుగా అనేక విషయాల గురించి తెలుసుకుంటున్నాం. ఉద్యోగాల కోసం వేలాది మంది యువత ఎన్నో తిప్పలు పడతారు. చాలా మందిలో టాలెంట్ ఉన్నప్పటికీ అంత త్వరగా ఉద్యోగం రాదు. అనేక రెజ్యూమ్‌లు పంపినా షార్ట్‌లిస్ట్‌లో తమ పేరు నిలవలేదని నిరుద్యోగులు వాపోతుంటారు.

మనం పంపిన రెజ్యూమ్ ద్వారా కంపెనీ ప్రతినిధులను ఆకర్షించాలి. ఉద్యోగం పొందడానికి మొదటి మెట్టు ఇదే. ఇటువంటి రెజ్యూమ్‌ను చాట్‌జీపీటీ సాయంతో చాలా పర్ఫెక్ట్‌గా రూపొందించుకోవచ్చు. కంపెనీ ప్రతినిధులను ఆకర్షించేలా రెజ్యూమ్‌లో ఏయే పాయింట్లు పొందుపర్చాలి? అన్న విషయాలు చాలా మందికి తెలియదు. చాట్‌జీపీటీతో రెజ్యూమ్ క్రియేట్ చేయడంతో కంపెనీల్లో తన పేరు షార్ట్‌లిస్ట్ అయిందని ఇటీవల చాలా మంది అంటున్నారు.

చాట్‌జీపీటీతో ఇలా క్రియేట్ చేసుకోండి..

* బ్రౌజర్‌లో ChatGPT ఓపెన్ చేయండి. ఆ తర్వాత హోమ్‌పేజీలో సైన్ ఇన్ అవ్వండి.

* ‘యు ఆర్ మై రెజ్యూమ్ క్రియేటర్’ అనే ప్రాంప్ట్‌ను క్రియేట్ చేయండి.

* లింక్డ్‌ఇన్‌కి వెళ్లండి. దరఖాస్తు చేయాలనుకుంటున్న కంపెనీ ఉద్యోగ అర్హతలు, నైపుణ్యాల వివరణను కాపీ చేసి, వాటిని చాట్‌జీపీటీలో పేస్ట్ చేయండి.

* చాట్‌జీపీటీలో మీ గురించిన వ్యక్తిగత సమాచారాన్ని టైప్ చేయండి.

* మీరు ఇచ్చిన వివరాల ఆధారంగా, చాట్‌జీపీటీ మీ రెజ్యూమ్‌ని సృష్టిస్తుంది.

* దాన్ని కాపీ చేసి, Instaresume.IOలో పేస్ట్ చేయండి. దీని ద్వారా రెజ్యూమ్ కోసం ఓ టెంప్లేట్‌ క్రియేట్ అవుతుంది.

* అనంతరం SkillSyncer వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఇందులో మీ రెజ్యూమ్‌ను అప్‌లోడ్ చేస్తే అది మీ ఏటీఎస్ స్కోర్‌ను చెబుతుంది. రెజ్యూమ్‌లో ఇప్పటికీ పొందుపర్చని కీలక పదాలను మీరు గుర్తించడానికి అది సహాయపడుతుంది.

మరో విధానం
ఓపెన్ఏఐలో ఇలా క్రియేట్ చేసుకోండి..

* చాట్‌జీపీటీలో సైన్ ఇన్ కోసం బ్రౌజర్‌లో ‘ఓపెన్ఏఐ’ అని సర్చ్ చేయండి.
* ఆ తర్వాత హోమ్‌పేజీలో సైన్ ఇన్ అవ్వండి.
* రెజ్యూమ్ ఎలా మొదలు పెట్టాలి? ఎలా ముగించాలి? అంటూ మనం అడిగే అన్ని ప్రశ్నలకు చాట్‌జీపీటీ సమాధానాలు అందిస్తుంది.
* రెజ్యూమ్ క్రియేట్ చేయడం ఎలా? అని టైప్ చేస్తే చాట్‌జీపీటీ జవాబులు ఇస్తుంది.
* వాటిల్లో మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవాలి.
* చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానాల్లో కొన్నింటిని సెలెక్ట్ చేసుకున్న తరువాత వాటిని మీకు నచ్చినట్లు ఎడిట్ చేసుకోవచ్చు. అందుకు చాట్‌జీపీటీ అందించిన పాయింట్లను కాపీ చేసి వర్డ్ డాక్యుమెంట్స్ లో పేస్ట్ చేసుకోవాలి.

Google Messages Spam : ఆన్‌లైన్ మోసాలకు గూగుల్ మెసేజెస్ ఫీచర్‌తో చెక్ పెట్టొచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?