Primary Schools : ప్రకృతి ఒడిలో చదువులే మంచిది.. ఐసీఎంఆర్

ప్రకృతి ఒడిలో చదవులే మంచిది అంటోంది ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన మండలి). రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ శాంతినికేతన్‌ను ఆదర్శంగా చెట్ల కింద పిల్లలకు తరగతులు చెప్పడం మంచిదని అంటోంది.

Primary Schools Study : ప్రకృతి ఒడిలో చదవులే మంచిది అంటోంది ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన మండలి). రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ శాంతినికేతన్‌ను ఆదర్శంగా చెట్ల కింద పిల్లలకు తరగతులు చెప్పడం మంచిదని అంటోంది. కరోనా కష్టకాలంలో పాఠశాలలు నెలలు తరబడి మూతపడితే పిల్లల విద్యపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఐసీఎంఆర్ అభిప్రాయపడింది. అందుకే స్కూళ్లను క్రమంగా తెరిచేందుకు ప్రయత్నించాలని సూచిస్తోంది. సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ, శాస్త్రవేత్తలు తను ఆనంద్‌, సమీరన్‌ పాండాలు పరిశోధన పత్రం ఇండియన్‌ జర్నల్‌ మెడికల్‌ రీసెర్చ్‌లో ప్రచురితమైంది. పిల్లల విద్యా జీవితం దృష్ట్యా దశలవారీగా పాఠశాలలు తెరవాలని సూచించింది. చెట్ల కింద తరగతులు నిర్వహించడం ద్వారా గాలీవెలుతురు బాగా వస్తుందని, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించుకోవాలని ఐసీఎంఆర్ సిఫార్సు చేసింది. ముందుగా ప్రాథమిక పాఠశాలలు తెరవాలని, ఆ తర్వాత ఒక్కొక్కటిగా విద్యాసంస్థలను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తెరవాల్సిందిగా సూచించింది.
Bamboo Plants : ఎకరం భూమి..7ఏళ్ళలో 17లక్షల అదాయం.. ఆరైతు ఏం పండించాడంటే?..

ఈ క్రమంలో ఉపాధ్యాయులతో పాటు బోధనేతర సిబ్బంది, రవాణా సిబ్బందికి టీకాలు అందించాల్సిందిగా సూచించింది. అంతేకాదు.. టీకా తీసుకున్నాక కూడా వారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని సూచించింది. తరగతి గదిలో పిల్లల ఆరోగ్యాన్ని గమనిస్తుండాలని, వైరస్ సోకిన వెంటనే వారిని ఇతర పిల్లల నుంచి వేరుచేయాలని సూచించింది. పాఠశాల సిబ్బంది, పిల్లలకు నిరంతరం పరీక్షలు నిర్వహిస్తూ ఉండాలని సూచనలు చేసింది. తద్వారా వైరస్‌ వ్యాప్తిని ప్రాథమిక దశలోనే అరికట్టవచ్చునని తెలిపింది. పిల్లల కోసం పాఠశాలలో ప్రత్యేకంగా కరోనా టెస్టు సెంటర్ ఏర్పాటు చేయడం చాలా ఉత్తమమైన మార్గమని సూచించింది. ఒకవేళ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటే వెంటనే స్కూలు మూసివేయాలని సూచించింది. వైరస్‌ వ్యాప్తి నిరోధించడానికి తగిన వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచించింది. అలాగే తరగతి గదుల్లో గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేయాలని తెలిపింది.

పిల్లలను దూరంగా కూర్చొబెట్టాలని సూచించింది. అసెంబ్లీ హాళ్లను తరగతుల కోసం ఉపయోగించుకోవాలని పిల్లలను విశాలమైన చోట కూర్చోబెట్టాల్సి ఉన్నందున అసెంబ్లీ హాళ్లు, ఇతర విస్తృతమైన స్థలాలను తరగతుల కోసం ఉపయోగించుకొనే ప్రయత్నం చేయాలి. పిల్లలు భోజనాలను పరస్పరం మార్చుకుంటుండాలి. అలాగే క్యాంటీన్లు, భోజనశాలల్లో సుదీర్ఘంగా కూర్చోకుండా చూడాలన్నారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ హైబ్రిడ్‌ మోడల్‌ను కచ్చితంగా కొనసాగించాలి. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న పిల్లలు ఆన్‌లైన్‌లో హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలి. మిగతా పిల్లలు రోజు విడిచి రోజు పాఠశాలలకు వచ్చేలా చూడాలని ఐసీఎంఆర్ సూచించింది.
Mystery Well : మింగేసే బావి.. నరక కూపం కాదు.. ప్రకృతి అందం!

ట్రెండింగ్ వార్తలు