Mystery Well : మింగేసే బావి.. నరక కూపం కాదు.. ప్రకృతి అందం!

యెమెన్‌లో మృత్యు కుహరంగా ప్రచారంలో ఉన్న బావి మిస్టరీని ఛేదించారు పరిశోధకులు. 112 మీటర్ల లోతున్న ఆ బావి నరక కూపం కాదని, అదొక ప్రకృతి అందంగా తేల్చేశారు.

Mystery Well : మింగేసే బావి.. నరక కూపం కాదు.. ప్రకృతి అందం!

Mystery Behind That Will Any Unknown Powers Swallowing To Hell

Mystery Well Unknown Powers : యెమెన్‌లో మృత్యు కుహరంగా ప్రచారంలో ఉన్న బావి మిస్టరీని ఛేదించారు పరిశోధకులు. 112 మీటర్ల లోతున్న ఆ బావి నరక కూపం కాదని, అదొక ప్రకృతి అందంగా తేల్చేశారు. యెమెన్‌ ఆల్‌ మహారాలోని బార్‌హౌట్‌ బావి.. చాలా ఏళ్ల నుంచి ఒక మిస్టరీగా ఉండిపోయింది. లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ భారీ బావి గురించి ఎన్నో కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. స్థానికులు కొందరు దుష్టశక్తులు కొలువైన బావిగా చెప్తారు. ఎక్కువ మంది మాత్రం శవాల దిబ్బగా పేర్కొంటారు. ఖైదీలను, శత్రువులను గుంపులుగా అందులో పడేసి ఊచకోత కోసేవాళ్లని ప్రచారం జరిగేది. అయితే వీటన్నింటికి తేల్చేందుకు తాజాగా ఎనిమిది మంది సాహసికులతో ఓ బృందం లోపలికి దిగింది. అందులో శవాల గుట్టలుగానీ, అస్థిపంజరాలుగానీ ఏవీ కనిపించలేవు. కనీసం కంపు వాసన కూడా రాలేదన్నారు.
Bullet Train : హైదరాబాద్ టు ముంబై బుల్లెట్‌ ట్రైన్.. మూడున్నర గంటల్లోనే చేరుకోవచ్చు!

లోయ అడుగున ఓ జలపాతం, రంగు రాళ్లు, మేలిమి ముత్యాలు వాళ్లకి దొరికాయి. కాకపోతే కొన్ని పాములు మాత్రం కనిపించాయి. అక్కడ దొరికిన వాటి మీద రీసెర్చ్‌ చేసి.. ఆ బావి వయసు తేల్చే పనిలో పడ్డారు పరిశోధకులు. గతంలో యెమెన్‌ అధికారుల బృందం ఒకటి ఈ బావిలో 50నుంచి 60 మీటర్ల దాకా వెళ్లి భయంతో వెనక్కి వచ్చేసిందట. ప్రస్తుతం ఈ భారీ బావి మిస్టరీని చేధించినప్పటికీ.. ఆ ఊరి ప్రజలు మాత్రం ఆ బావి పక్కకు వెళ్లమనే చెప్తున్నారు. బావిలోకి దిగిన బృందసభ్యులకు త్వరలోనే అశుభం జరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యెమెన్‌లో తూర్పున ఆల్‌-మహ్రా ప్రావిన్సులోని ఎడారి ప్రాంతంలో 112 మీటర్ల లోతు 30 మీటర్ల వెడల్పుతో ఈ బావి ఉంది. ఒమన్‌లోని జర్మన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన ఒమన్‌ కేవ్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ టీమ్‌ (OCET) ఈ బావిలోకి దిగేందుకు సిద్ధమైంది.

ఈ మిస్టరీ బావిలో బృందానికి నుయ్యి అడుగు భాగంలో జంతు కళేబరాలు, మనుషుల ఎముకలు, పాములు, కొన్ని రాళ్లు కనిపించాయి. స్థానికులు చెప్పినట్టుగా అదృశ్య శక్తులు ఏమి లేవని పరిశోధకులు తేల్చేశారు. బావి అడుగునుంచి నీరు, రాళ్లు, మట్టి, జంతు కళేబరాల నమూనాలను పరిశోధకులు సేకరించారు. బావి అడుగు భాగం చేరుకోవడానికి తాళ్ల సాయంతో కిందకు దిగుతున్న సమయంలో దాదాపు 50-60 మీటర్ల దిగువకు రాగానే ఏవేవో వింత సంఘటనలు, శబ్దాలను గమనించినట్టు తెలిపారు. ఒకరకమైన వాసన, పొగ రావడాన్ని గుర్తించామన్నారు. బాయిలో దాగిన మిస్టరీని లోతుగా పరిశోధించాల్సిన అవసరం ఉందని బబైర్‌ పేర్కొన్నారు. ఈ మృత్యుకుహరం కూడా పరిసరాల్లోకి వచ్చిన మనుషులు, జంతువులు, పక్షులను మింగేస్తోందని వందల ఏళ్లుగా విశ్వాసం ఉంది. ఈ బిలంలో కొన్ని అదృశ్య శక్తులు ఉన్నట్టు ప్రచారం ఉండేది. బావి మిస్టరీ ఛేదించేందుకు యెమెన్‌ ప్రభుత్వాధికారులు కూడా ధైర్యం చేయలేదు. కానీ, బావిలోకి దిగిన OCET బృందసభ్యులకు ఏదైనా అశుభం జరిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.
Telugu Film Shooting: జెట్ స్పీడ్‌తో టాలీవుడ్.. ఏ సినిమా ఎక్కడ షూట్‌లో ఉందంటే