Bullet Train : హైదరాబాద్ టు ముంబై బుల్లెట్‌ ట్రైన్.. మూడున్నర గంటల్లోనే చేరుకోవచ్చు!

హైదరాబాద్ టు ముంబై బుల్లెట్ ట్రైన్ రాబోతోంది. కేవలం మూడున్నర గంటల్లోనే హైదరాబాద్ నుంచి ముంబై చేరుకోవచ్చు. రెండు నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ రాకపోకలు త్వరలో సాగించనుంది.

Bullet Train : హైదరాబాద్ టు ముంబై బుల్లెట్‌ ట్రైన్.. మూడున్నర గంటల్లోనే చేరుకోవచ్చు!

Mumbai Is Just Three Hours Away From Hyderabad In Proposed Bullet Train

Bullet Train : హైదరాబాద్ టు ముంబై బుల్లెట్ ట్రైన్ రాబోతోంది. కేవలం మూడున్నర గంటల్లోనే హైదరాబాద్ నుంచి ముంబై చేరుకోవచ్చు. రెండు నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ రాకపోకలు త్వరలో సాగించనుంది. బుల్లెట్‌ రైలు ప్రారంభించేందుకు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NHSRCL‌) ప్రతిపాదించింది. నవంబర్‌ 5న ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-బిడ్‌ సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అచల్‌ ఖేర్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. నవంబర్ 18న టెండర్లు తెరిచే అవకాశం ఉందన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR‌)ను రూపొందించేందుకు టెండర్లు పిలిచారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ నుంచి ముంబైకి రైలులో మూడున్నర గంటల్లోనే చేరుకోవచ్చు. తద్వారా 9.5 గంటల సమయం ఆదా కానుంది.
Sarayu Roy: నేను వర్జిన్ కాదు.. ఏడేళ్ల సహజీవనం.. సరయు బోల్డ్ కామెంట్స్!

ప్రస్తుతం రెండు నగరాల మధ్య హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తోంది. ఈ రైలు ముంబై చేరకునేందుకు 14 గంటల సమయం పడుతుంది. ఈ కొత్త బుల్లెట్ రైలు ప్రాజెక్టును దాదాపు రూ.లక్ష కోట్ల వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (PPP) పద్ధతిలో నిర్మించనున్నారు. ముంబై-హైదరాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు.. తెలంగాణలోని జహీరాబాద్‌ మీదుగా నిర్మించాలని భావించారు. కానీ, దూరం, ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించేందుకు వికారాబాద్‌ మీదుగా బుల్లెట్ ట్రైన్ నిర్మించేందుకు సర్వే చేస్తున్నారు. ముంబై-పుణె-జహీరాబాద్‌ మీదుగా హైదరాబాద్‌ వరకు 780 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బై-పుణె-గుల్బర్గా-తాండూరు-వికారాబాద్‌ మీదుగా హైదరాబాద్‌కు అలైన్‌మెంట్‌ మార్చనున్నారు. 649.76 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.

NHSRCL‌ ఆధ్వర్యంలో బుల్లెట్‌ రైల్వే లైన్‌ సర్వే పనులు శరవేగంగా జరుగనున్నాయి. వికారాబాద్‌ జిల్లాపరిధిలో ప్రభుత్వ పరంగా సహాయ, సహకారాల కోసం సంస్థ ప్రతినిధులు జిల్లా అధికారులను సంప్రదించారు. జిల్లా పరిధిలోని దాదాపు 40 గ్రామాల్లో సోషల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ చేపట్టే అవకాశం ఉంది. DPR రెడీ అయిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుందో క్లారిటీ రానుంది. ఈ ప్రాజెక్టుకోసం కొత్తగా రైల్వే ట్రాక్‌ కూడా నిర్మించనున్నారు. ప్రస్తుత ట్రాక్‌ బుల్లెట్‌ రైలు వేగాన్నితట్టుకోలేదు.

దేశవ్యాప్తంగా 8 బుల్లెట్‌ రైలు కారిడార్లను కేంద్రప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిలో నాలుగు వరకు ముంబైతో అనుసంధానం చేయనుంది. ముంబై-అహ్మదాబాద్‌ కారిడార్‌ 2028లోపు అందుబాటులోకి రానుంది. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు లైన్‌ ఏర్పాటుకు రూట్‌ మ్యాప్‌ పనులు మొదలయ్యాయి. తాండూరు, వికారాబాద్‌ ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహిస్తున్నారు. గూగుల్‌ మ్యాపింగ్‌ కూడా దాదాపు పూర్తయినట్టే. గూగుల్‌ మ్యాపింగ్‌ ప్రాంతాల్లో ప్రతి 10 కిలోమీటర్లకు ఒక పిల్లర్‌ నిర్మించనున్నారు. పిల్లర్ల ఆధారంగా మరోసారి ఏరియల్‌ సర్వే నిర్వహిస్తారు.

Big Boss 5: ఎలిమినేషన్ గండం.. నాలుగో వారంలో ఎనిమిది మంది