JEE Advanced Results: జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) అడ్వాన్స్‌డ్ 2022 ఫలితాలు నేడు (ఆదివారం) విడుదల కానున్నాయి. jeeadv.ac.in ద్వారా అభ్యర్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఐఐటీ బాంబే ఈ ఫలితాల్ని విడుదల చేయనుంది.
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ 4 రోజుల పాదయాత్రలో 3 వివాదాలు
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో బీ టెక్ ఇంజనీరింగ్, బీఎస్సీ కోర్సుల్లో సీట్ల భర్తీకి గత నెల 28న పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1,56,089 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలు విడుదలైన తర్వాత ఈ నెల 12, సోమవారం నుంచి జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీని ద్వారా ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే పలు విద్యాసంస్థల్లోని సీట్లను భర్తీ చేస్తారు. దేశంలో మొత్తం 23 ఐఐటీలు ఉన్నాయి. వీటిలో 16,598 సీట్లు ఉండగా, బాలికలకు 1,567 సీట్లను సూపర్ న్యూమరరీ కింద కేటాయిస్తారు.
ఐఐటీల్లో ప్రత్యేకంగా 2,129 మెకానికల్ ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. మొత్తం ఇంజనీరింగ్ సీట్లలో ఇవి 13 శాతం. అయిదేళ్ల డ్యూయల్ డిగ్రీ సీట్లను కలిపితే ఇది 14 శాతానికి చేరుతుంది. బీ టెక్‌లో మెకానికల్, సీఎస్ఈ, ఎలక్ట్రికల్, సివిల్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, మెటలర్జికల్ వంటి విభాగాలున్నాయి. ఈ ఫలితాల్లో వెయ్యి లోపు ర్యాంకులు సాధించిన వారిలో ఎక్కువగా ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్‌లలో చేరేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.