Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ 4 రోజుల పాదయాత్రలో 3 వివాదాలు

2021లో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ జార్జ్ పొన్నయ్యను అరెస్ట్ చేశారు. అంతే కాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పలు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా రాహుల్ కలిసిన సందర్భంలో కూడా హిందూ దేవుళ్లను కించపరిచే వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ 4 రోజుల పాదయాత్రలో 3 వివాదాలు

3 Controversies in 4 days Rahul Bharat Jodo Yatra

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రోజుకో వివాదానికి తెరలేపుతోంది. ఈ యాత్ర ప్రారంభమై నాలుగు రోజులు కాకముందే మూడు వివాదాలు చెలరేగాయి. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ వివాదాలకు తెరలేపుతోంది. ఈ యాత్రకు సంబంధించి ప్రతి అంగుళాన్ని పరిశీలిస్తూ ఏదో ఒకదాన్ని తప్పుడుగా చూపే ప్రయత్నంలో బీజేపీ సిద్ధంగా ఉంది. ఒక ఆరోపణ రావడం ఆలస్యం బీజేపీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీపై రాహుల్ గాంధీపై మూకుమ్మడి దాడికి దిగుతున్నారు.

భారత్ జోడో యాత్ర ప్రారంభమైన తొలిరోజే రాహుల్‭ అవసరాలకు ఉన్న లగ్జరీ కంటైనర్ల అంశాన్ని బీజేపీ లేవనెత్తింది. విలాసవంతమైన కంటైనర్లతో పాదయాత్ర చేయడమేంటని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఏసీ సౌకర్యం ఉన్న లగ్జరీ కంటైనర్లు అవసరమా అని విమర్శలు గుప్పించారు.

ఇక రెండవది రాహుల్ టీషర్ట్ వివాదం.. భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ బర్బెరీ బ్రాండ్‌కు చెందిన టీ-షర్టు ధరించారని, దీని ధర రూ.41వేలు అని బీజేపీ చెబుతోంది. రాహుల్‌ ఎంత ఖరీదైన టీ-షర్టును ధరించారో చూడండంటూ ‘భారత్‌ దేఖో’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. రాహుల్‌ ఫొటో పక్కన రూ.41,257 ఖరీదైన బర్బెరీ బ్రాండ్‌ టీషర్టును పోస్టు చేసింది. విలాసవంతమైన వస్త్రధారణతో నిరుపేదల సమస్యలు తెలుసుకుంటారా అని బీజేపీ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది.

ఇక తాజాగా.. జార్జ్ పొన్నయ్య అనే పాస్టర్‭ను కలవడంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. 2021లో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ జార్జ్ పొన్నయ్యను అరెస్ట్ చేశారు. అంతే కాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పలు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా రాహుల్ కలిసిన సందర్భంలో కూడా హిందూ దేవుళ్లను కించపరిచే వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాహుల్ హిందూ వ్యతిరేకి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు.

Prashant kishor on Nitish kumar: మరోసారి సీఎం నితీశ్‭ను టార్గెట్ చేసిన పీకే