Indian Army Jobs: ఎన్‌సీసీ అభ్యర్థులకు ఆర్మీ జాబ్స్.. నెలకు రూ.56 వేల జీతం.. దరఖాస్తు ఇలా చేసుకోండి

ఎన్‌సీసీ సర్టిఫికేట్‌ ఉన్నవారికి ఇండియన్‌ ఆర్మీ(Indian Army Jobs) గుడ్ న్యూస్ చెప్పింది. దేశ రక్షణ దళంలో భాగం అయ్యే అవకాశాన్ని కల్పించనుంది.

Indian Army Jobs: Lieutenant Jobs in Indian Army for NCC Candidates

Indian Army Jobs: ఎన్‌సీసీ సర్టిఫికేట్‌ ఉన్నవారికి ఇండియన్‌ ఆర్మీ గుడ్ న్యూస్ చెప్పింది. దేశ రక్షణ దళంలో భాగం అయ్యే అవకాశాన్ని కల్పించనుంది. ఈమేరకు షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో స్పెషల్‌ ఎంట్రీ ద్వారా అర్హులైన వారికి ఉద్యోగావకాశాలను కలిపించనుంది(Indian Army Jobs). దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 70 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే, ఈ పోస్టులకు కేవలం అవివాహిత పురుషులు మాత్రమే అర్హులని సూచించింది. కాబట్టి, అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ www.joinindianarmy.nic.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

SSC CGL Exams: ఎస్ఎస్సీ కీలక అప్డేట్.. సీజీఎల్ టైర్ 1 పరీక్షల షెడ్యూల్ విడుదల.. అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి.

విద్యార్హతలు:

  • అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
  • ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నవారూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • మూడు అకడమిక్‌ ఇయర్స్‌ ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ వింగ్‌లో కొనసాగి ఉండాలి.
  • ఎన్‌సీసీ ‘సి’ సర్టిఫికెట్‌లో కనీసం బీ గ్రేడ్‌ అయినా సాధించి ఉండాలి.

వయోపరిమితి:
అభ్యర్థుల వయసు జనవరి 1, 2026 నాటికి 19 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. అలాగే జనవరి 2, 2001 జనవరి 1, 2007 మధ్యలో జన్మించినవారై ఉండాలి.

ఫిజికల్‌ ఫిట్నెస్:

  • అభ్యర్థులు 2.4 కి.మీ పరుగును 10 నిమిషాల 30 సెకన్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది.
  • అలాగే పుష్‌ అప్స్‌–30, పుల్‌ అప్స్‌–40, సిట్‌అప్‌– 06 తప్పకుండా చేయాలి.

ఎంపిక విధానం:
ముందుగా అభ్యర్థులు పొందిన అకడమిక్, ఎన్‌సీసీ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చే­స్తారు. ఎన్‌సీసీలో ఏ గ్రేడ్‌ ఉంటే 50, బీ గ్రేడ్‌ ఉంటే 25 బోనస్‌ మార్కులు ఇస్తారు. డిగ్రీలో పొందిన మార్కులకూ గరిష్ఠంగా 50 బోనస్‌ మార్కులు కేటాయించారు. ఈ రెండిటి ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు.

శిక్షణ, వేతన వివరాలు:

  • ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ చెన్నైలో 49 వారాలు శిక్షణ ఉంటుంది.
  • ట్రైనింగ్ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ అందిస్తారు.
  • శిక్షణ పూర్తయిన అభ్యర్థులకు మద్రాస్‌ యూనివర్సిటీ పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని ప్రధానం చేస్తుంది.
  • ఆతరువాత లెఫ్టినెంట్‌ హోదాతో వారిని విధుల్లోకి తీసుకుంటారు.