IIM Bodhgaya : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌, ఎంబీఏ, ఎమ్‌కాం, ప్రోస్టు గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

IIM Bodhgaya : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Indian Institute of Management Vacancies

Updated On : November 18, 2022 / 9:01 PM IST

IIM Bodhgaya : భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన బోధ్‌గయలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్టేట్‌ కమ్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్‌ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌, ఎంబీఏ, ఎమ్‌కాం, ప్రోస్టు గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే పోస్టును బట్టి సంబంధిత పనిలో ఏడాది నుంచి 15 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 30 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఎవరైనా డిసెంబర్‌ 6, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.2,09,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://iimbg.ac.in/careers/ పరిశీలించగలరు.