IIT Roorkee Recruitment : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ లో ఉద్యోగ ఖాళీలను భర్తీ

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఆయా పోస్టులను అనుసరించి విద్యార్హతలు కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంది. OBC , EWS కేటగిరీకి రూ. 400 ఫీజు చెల్లించాలి. SC ,ST , PWD , మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

IIT Roorkee Recruitment : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ లో ఉద్యోగ ఖాళీలను భర్తీ

Indian Institute of Technology Roorkee

Updated On : August 20, 2023 / 3:44 PM IST

IIT Roorkee Recruitment : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 78 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అధికారిక వెబ్ సైట్ ను iitr.ac.in సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

READ ALSO : Soft Drinks : రోజుకో గ్లాసు కూల్ డ్రింక్ సిప్ చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త!

విభాగాల వారీగా ఖాళీల వివరాలకు సంబంధించి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ – 10, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ – 02, అసిస్టెంట్ సేఫ్టీ ఆఫీసర్ – 01, జూనియర్ టెక్నికల్ ఆర్కిటెక్చర్ – 01, కోచ్ – 02, స్టాఫ్ నర్స్ – 02, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ – 01, జూనియర్ సూపరింటెండెంట్ – 12, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ – 23, డ్రైవర్ – 01, జూనియర్ అసిస్టెంట్ – 23 పోస్టుల ఖాళీలు ఉన్నాయి. వీటిలో గ్రూప్ ఎ పోస్టుకు 31 ఖాళీలు, గ్రూప్ సికి 47 ఖాళీలు నిర్ణయించారు.

READ ALSO : Russia Luna25: జాబిలిని అందుకోలేకపోయిన రష్యా.. కుప్పకూలిన లూనా-25.. ఇక చంద్రయాన్-3?

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఆయా పోస్టులను అనుసరించి విద్యార్హతలు కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంది. OBC , EWS కేటగిరీకి రూ. 400 ఫీజు చెల్లించాలి. SC ,ST , PWD , మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

READ ALSO : Rose Flowers Cultivation : గులాబీ పూల సాగుతో ప్రతినెల 70వేల నికర అదాయం పొందుతున్న రైతు

అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 30, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ iitr.ac.inని పరిశీలించగలరు.