ISRO Recruitment
ISRO Recruitment : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 63 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో టెక్నీషియన్ 30 ఖాళీలు, టెక్నికల్ అసిస్టెంట్ 24 ఖాళీలు, ఇతర పోస్టులు 9 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Paper Cups Side Effects : పేపరు కప్పుల్లో టీ తాగుతున్నారా ? మైక్రో ప్లాస్టిక్ కణాలతో నరాలపై దుష్ప్రభావం !
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో ఐటీఐ డిప్లొమా కలిగి ఉండాలి. వయోపరిమితి 35 ఏళ్లుగా నిర్ణయించారు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
READ ALSO : Digestive System : వేసవిలో జీర్ణప్రక్రియ సవ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలను తీసుకోవటం మంచిది !
అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 24, 2023 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; isro.gov.in పరిశీలించగలరు.