IGNOU Recruitment : ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

మొత్తం పోస్టుల్లో 83 పోస్టులు అన్‌రిజర్వ్‌డ్‌, 29 ఎస్సీ, 12 ఎస్టీ, 55 ఓబీసీ, 21 ఈడబ్ల్యూఎస్‌ పోస్టులు కేటాయించారు. అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ 200 పోస్టుల్లో ఈ రిక్రూట్‌మెంట్ కోసం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో మినహాయింపు వర్తిస్తుంది.

IGNOU Recruitment : ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ignou

Updated On : March 31, 2023 / 4:49 PM IST

IGNOU Recruitment : ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిషికేషన్ ద్వారా మొత్తం 200 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో జూనియర్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఇటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి నిమిషానికి 40 పదాల వేగంతో ఇంగ్లీష్ టైపింగ్ , నిమిషానికి 35 పదాల వేగంతో హిందీ టైపింగ్ వచ్చి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

READ ALSO : Summer Super Food : వేసవి కాలంలో శరీరానికి అన్ని విధాలుగా మేలు చేసే పెరుగు !

మొత్తం పోస్టుల్లో 83 పోస్టులు అన్‌రిజర్వ్‌డ్‌, 29 ఎస్సీ, 12 ఎస్టీ, 55 ఓబీసీ, 21 ఈడబ్ల్యూఎస్‌ పోస్టులు కేటాయించారు. అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ 200 పోస్టుల్లో ఈ రిక్రూట్‌మెంట్ కోసం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో మినహాయింపు వర్తిస్తుంది.

అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించబడుతుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.19 వేల 900 నుంచి రూ.63 వేల 200 వరకు వేతనం చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; recruitment.nta.nic.inని పరిశీలించగలరు.