హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేస్తే ఈరోజు సాయంత్రం 6గంటల్లోగా సమస్య పరిష్కరిస్తామని ఇంటర్ బోర్డు అధికారి చెప్పారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణతో శనివారం ఉదయం నుంచి విద్యార్ధులు తమ తల్లి తండ్రులతో ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎట్టకేలకు బోర్డు కు చెందిన అధికారి ఒకరు బయటకు వచ్చి విద్యార్ధుల సమస్యను పరిష్కరిస్తాని హామీ ఇచ్చారు.
ఇంటర్ మీడియేట్ బోర్డు ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని భావించినా, తప్పులు దొర్లాయని భావించినా, ఏమైనా అవకతవకలు జరిగాయని భావించిన విద్యార్ధులు వారి వారి మార్కుల మెమోల మీదవారి సెల్ ఫోన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, రోల్ నెంబరు వేసి వారు ఎదుర్కోన్న ఇబ్బందిని రాసి , బోర్డు ఆఫీసులో సమర్పిస్తే శనివారం సాయంత్రం 6 గంటల్లోగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, అది ఈ ఒక్కరోజు మాత్రమే అని ఇంటర్ బోర్డుకు చెందిన అధికారి చెప్పారు. కాగా…వేల సంఖ్యలో విద్యార్ధులకు అన్యాయం జరిగితే ఇక్కడకు వచ్చిన వారికే న్యాయం చేస్తామనటం ఎంతవరకు సమంజసం అని అడగ్గా ……. కేవలం ఇద్దరు ,ముగ్గురు విద్యార్ధుల మెమోల్లో తప్పులున్నాయని ఆయన సమాధానం చెప్పారు.