Tcs
TCS : ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. బీటెక్, బీఈ, ఇతర కోర్సులు చదువుతున్నవారు టీసీఎస్‌లో ఇంటర్‌షిప్ అవకాశాలకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. టీసీఎస్ ప్రతీ ఏటా 200 మంది ఇంటర్న్స్‌కి అవకాశం ఇస్తోంది. బీటెక్, బీఈ చివరి సంవత్సరం చదువుతున్నవారు, ఎంటెక్, ఎంఎస్, పీహెచ్‌డీ చదువుతున్నవారు కంప్యూటర్ సైన్స్‌లో రీసెర్చ్ చేయాలనుకుంటే టీసీఎస్‌లో ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేయవచ్చు.
ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి సైకాలజీ, సోషియాలజీ, ఎకనమిక్స్, మ్యాథమెటిక్స్, గేమ్ డిజైన్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ లాంటి సబ్జెక్ట్స్‌లో మాస్టర్స్, పీహెచ్‌డీ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేయొచ్చు. ఎంపికైనవారు 6 వారాల నుంచి 8 వారాల షార్ట్ ఇంటర్న్‌షిప్, 16 వారాల నుంచి 18 వారాల లాంగ్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. అవకాశాన్ని బట్టి ఇంటర్న్‌షిప్ వ్యవధినిమార్చుకోవచ్చు.
ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైనవారు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో, సమస్యల్ని గుర్తించి వాటి పరిష్కారాలు సూచించడం, ప్రోటోటైప్ రూపొందించడం, పరిశోధనా పత్రాలను ప్రచురించడం, రీసెర్చ్ ఎగ్జిక్యూషన్, సర్వేలు నిర్వహించి అవకాశాలు, సవాళ్లను గుర్తించడం లాంటి వాటిని చేయాల్సి ఉంటుంది. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్థులు టీసీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాలకు https://www.tcs.com/ పరిశీలించగలరు.