reliance foundation scholarships
Reliance Foundation Scholarships : భారతదేశంలో అతిపెద్ద స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లలో ఒకటైన రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2023-24 విద్యా సంవత్సరానికి స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
READ ALSO : BOB Financial Recruitment : బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ లో ఖాళీల భర్తీ
రిలయన్స్ ఫౌండేషన్ భారతదేశ వ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు , పిజీ విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు అందజేయనుంది. దీనికి సంబంధించి అర్హులైన విద్యార్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వనిస్తుంది. డిగ్రీ, పీజీ చదువుకునేందుకు ఫీజు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్న వారు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఏదైనా గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థలో ఈ సంవత్సరం ఏదైనా కోర్సులో చేరిన మొదటి సంవత్సరం విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే పీజీ కోర్సులకు పీజీ స్కాలర్‌షిప్ ఇవ్వనున్నారు.
READ ALSO : Egg Benefits : రోజు వారి ఆహారంలో గుడ్డును చేర్చుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
రిలయన్స్ ఫౌండేషన్ ఈ ప్రోగ్రామ్ ద్వారా 5000 అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు , 100 పీజీ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. UG స్కాలర్‌షిప్ గాను గరిష్టంగా రూ. 2 లక్షలు, పీజీకి గరిష్టంగా రూ. 6 లక్షల స్కాలర్‌షిప్‌గా నిర్ణయించింది. దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. విద్యార్థులు reliancefoundation.orgను సందర్శించి దరఖాస్తులను పంపవచ్చు.
దరఖాస్తు చేసే విధానం ;
విద్యార్థులు ముందుగా https://www.scholarships.reliancefoundation.org/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. అనంతరం హెం పేజీలో కనిపించే Application Portal ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ మీ వివరాలను నమోదు చేసి అప్లికేషన్ పూర్తి చేయాలి. అనంతరం సబ్ మిట్ చేయాలి.