Central Teacher Eligibility Test
CTET 2024 : సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్)- జనవరి 2024 నోటిఫికేషన్ విడుదలైంది. సెం’ట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) జాతీయస్ధాయిలో ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నవారి సామర్థ్యాన్ని అంచనా వేయటం కోసం ప్రతి ఏడాది రెండుసార్లు అనగా జనవరి, జులై మాసాల్లోఈ పరీక్షను నిర్వహిస్తారు.
ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ), ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ) వేరు వేరుగా పేపర్ 1, పేపరు 2 పరీక్షలు నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకునే వారి అర్హతల విషయానికి వస్తే ప్రైమరీ స్టేజ్ అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ లేదా ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లో డిప్లొమా లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా డిగ్రీతోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
READ ALSO : Whatsapp Video Controls : యూట్యూబ్‌లోనే కాదు భయ్యా.. వాట్సాప్‌లోనూ వీడియో ప్లేబ్యాక్ కంట్రోల్స్..!
ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ) అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/బీఈడీ లేదా 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా నాలుగేండ్ల బీఏ/బీఎస్సీ ఎడ్యుకేషన్, బీఏఈడీ, బీఎస్‌ఈడీ, డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్,ఓబీసీ అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 రూ.1000 చెల్లించాలి. రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకునేవారు రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 కు రూ.500; రెండు పేపర్లకు అయితే రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.
READ ALSO : Keeping Bones Healthy : ఎముకలను ఆరోగ్యంగా ఉంచటంలో కీలకపాత్ర పోషించే ఇనుముతోపాటు ఇతర విటమిన్లు !
సీటెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు నవంబరు 23 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు ఆఖరి తేదిగా నిర్ణయించారు. ఫీజు చెల్లించడానికి చివరితేది23.11.2023కాగా, పరీక్ష తేదీ 21.01.2024.గా ప్రకటించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://ctet.nic.in/
పరీక్ష వివరాలు ;
పేపర్-1 ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ) అభ్యర్ధులకు నిర్వహిస్తారు. మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తుండగా దీనిలో మొత్తం 5 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 2.30 గంటలుగా నిర్ణయించారు.
READ ALSO : Watermelon : వేసవిలో శరీరాన్ని చల్లగా,ఆరోగ్యంగా ఉంచే పుచ్చకాయ !
పేపర్-2 ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ) అభ్యర్ధులకు నిర్వహిస్తారు. మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తుండగా ఇందులో 3 విభాగాలు ఉంటాయి. వాటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగోజీ, లాంగ్వేజ్-1 , లాంగ్వేజ్-2 అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్‌లో 60 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు నిర్ణయించారు.