Indian Statistical Institute, Kolkata
JOBS : పశ్చిమ బెంగాల్ కోల్‌కతా లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ లింక్డ్ పర్సన్ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం 3 ఖాళీలను భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన వీరిని తీసుకోనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల గరిష్ట వయస్సు 01-07-2022 నాటికి 35 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఉమెన్స్ మరియు దివ్యాంగ అభ్యర్థులకు ప్రభుత్వం నియమాల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే స్టాటిస్టిక్స్,డేటా సైన్స్,ఎకనామెట్రిక్స్,పాపులేషన్ స్టడీస్ సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన అనుభవం కలిగి ఉండాలి. నెలకి వేతనంగా రూ.25,000 నుంచి రూ.45,000 వరకు చెల్లిస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఈ మెయిల్ అడ్రస్ sosu@isical.ac.in, దరఖాస్తులను పంపేందుకు జులై 22, 2022 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; isical.ac.in పరిశీలించగలరు.