Itbp (1)
Jobs : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్.ఐ) పోస్టులకు రిక్రూట్‌మెంట్ నిర్వహించనున్నారు. మొత్తం 37 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు పరిమితి 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల అర్హతలకి సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి 10వ తరగతి ఉత్తీర్ణత మరియు సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి.
అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ , రాత పరీక్ష, డాక్యుమెంటేషన్, వైద్య పరీక్ష, రివ్యూ మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ. 35,400- 1,12,400 జీతంగా చెల్లిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ14 ఆగస్టు 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ itbpolice.nic.in పరిశీలించగలరు.