Delhi riots: రెండేళ్లక్రితం ఢిల్లీలో జరిగిన అల్లర్లలో పాల్గొన్న ఒక విద్యార్థినికి అడ్మిషన్ నిలిపి వేసింది జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ. సఫూరా జార్గర్ అనే మహిళ 2020, ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో పాల్గొంది. ఈ కారణంగా ఆమెను అధికారులు 2020, ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. అప్పుడామె మూడు నెలల గర్భవతి.
Viral video: పెరట్లో మంచంపై పడుకున్న మహిళ.. ఆమె మీదికెక్కిన నాగుపాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
అప్పట్లో కేంద్రం ప్రవేశపెట్టిన సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్‌కు వ్యతిరేకంగా ఆమె ఉద్యమించింది. అరెస్టు తర్వాత బెయిల్‌పై విడుదలైంది. తాజాగా యూనివర్సిటీ అధికారులు వివిధ సాంకేతిక కారణాలో ఆమె అడ్మిషన్ నిరాకరించారు. సరూఫా.. తాజాగా సోషియాలజీ విభాగంలో పీహెచ్‌డీ/ఎంఫిల్ చేసేందుకు జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకుంది. అయితే, ఆమె ప్రొగ్రెస్ రిపోర్టు విషయంలో సూపర్ వైజర్ సంతృప్తికరంగా లేరని, అలాగే సరూఫా.. ఒక మహిళా స్కాలర్‌గా పొడిగింపు కోసం దరఖాస్తు కూడా చేయలేదని యూనివర్సిటీ తెలిపింది. తన థీసిస్‌కు సంబంధించిన వివరాల్ని కూడా సమర్పించలేదని, దీంతో కమిటీ ఆమె అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకుందని యూనివర్సిటీ వెల్లడించింది.
CM KCR: బీజేపీ ముక్త భారత్ కోసం అందరూ సన్నద్ధం కావాలి: సీఎం కేసీఆర్
దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సరూఫా సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. యూనివర్సిటీ నిర్ణయం వల్ల తన హృదయం బద్ధలైందని, అయితే, తన స్ఫూర్తి మాత్రం దెబ్బతినలేదని ఆమె తన ట్వీట్‌లో పేర్కొంది.