CM KCR: బీజేపీ ముక్త భారత్ కోసం అందరూ సన్నద్ధం కావాలి: సీఎం కేసీఆర్
బీజేపీ ముక్త భారత్ కోసం అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. పెద్దపల్లి జిల్లాలో సోమవారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు.

CM KCR: దేశంలో బీజేపీ ముక్త భారత్ కోసం అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. త్వరలో బీజేపీని పారద్రోలి రైతు ప్రభుత్వం రాబోతుంది అన్నారు. పెద్దపల్లి జిల్లాలో సమీకృత కలెక్టరేట్ భవనంతోపాటు, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.
Viral video: పెరట్లో మంచంపై పడుకున్న మహిళ.. ఆమె మీదికెక్కిన నాగుపాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘గుజరాత్ మోడల్ అంటూ దేశ ప్రజలను బీజేపీ దగా చేస్తోంది. బీజేపీ అడ్డగోలుగా ధరలు పెంచి ప్రజలను మోసం చేసింది. మద్యపాన నిషేధం ఉన్న గుజరాత్ రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. కల్తీ మద్యం కారణంగా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి మోదీ ఏం సమాధానం చెబుతారు? బూట్లు మోసే నేతలు బీజేపీలో ఉన్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని కాపాడుకుందామా? లేక దొంగలు, గజ దొంగలకు తెలంగాణను అప్పగిద్దామా? ధాన్యం కొనండి అంటే ఎక్కడ పెట్టుకోవాలి అని ప్రధాని అడుగుతున్నారు. దేశ ప్రజలను దగా చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏం చేస్తోంది? అడ్డగోలుగా డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతోంది. ముందుచూపు లేని పాలనతో దేశాన్ని కష్టాల్లోకి నెడుతున్నారు. రూ.లక్షల కోట్లు దోచుకున్న గజ దొంగలు మతం పేరుతో చిచ్చు పెడుతున్నారు.
Chhattisgarh: విషాదం నింపిన పిక్నిక్.. జలపాతంలో కొట్టుకుపోయి ఆరుగురు పర్యాటకులు మృతి
ఎస్సారెస్పీలో నీళ్లు పారాలా? మతం పేరుతో రక్తం పారాలా? పెద్దపల్లి… జిల్లా అవుతుందని కలలో కూడా ఎవరూ అనుకోలేదు. సింగరేణిలో ఎంతమందికి డిపెండెంట్ ఉద్యోగాలు దొరికాయో అందరికీ తెలుసు. దేశమే ఆశ్చర్యపడేలా పాలన సాగిస్తున్నాం. దేశంలో అత్యధికంగా సింగరేణి కార్మికులకు బోనస్ ఇస్తున్నాం. అన్ని వర్గాల ప్రజల కోసం మంచి పనులు చేసుకుంటున్నాం. దేశమే ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతోంది. 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు నాతో చర్చలు జరిపారు. తెలంగాణలో ఉన్న కార్యక్రమాలు ఏ ఒక్క రాష్ట్రంలోనూ లేవని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి రావాలని రైతు సంఘాల నేతలు సూచిస్తున్నారు’’ అంటూ కేసీఆర్ ప్రసంగించారు.