Chhattisgarh: విషాదం నింపిన పిక్నిక్.. జలపాతంలో కొట్టుకుపోయి ఆరుగురు పర్యాటకులు మృతి

ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా జలపాతం వద్దకు విహారయాత్రకు వెళ్లిన పర్యాటకులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. జలపాతం వద్ద స్నానం చేస్తుండగా, ఆరుగురు నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో జరిగింది.

Chhattisgarh: విషాదం నింపిన పిక్నిక్.. జలపాతంలో కొట్టుకుపోయి ఆరుగురు పర్యాటకులు మృతి

Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్‌లో దారుణం జరిగింది. సరదాగా విహారయాత్రకు వెళ్లిన పర్యాటకుల్ని మృత్యువు బలిగొంది. జలపాతం వద్ద కొలనులో స్నానం చేస్తుండగా నీట మునిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా బంధువులే. ఛత్తీస్‌ఘడ్‌లోని కొరియా జిల్లాలో ఉన్న రమ్దహా జలపాతం వద్ద ఆదివారం ఈ ఘటన జరిగింది.

Viral video: పెరట్లో మంచంపై పడుకున్న మహిళ.. ఆమె మీదికెక్కిన నాగుపాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాకు చెందిన ఒక కుటుంబ సభ్యులు, వారి బంధువులు అందరూ కలిసి 15 మంది రమ్దహా జలపాతం వద్దకు వెళ్లారు. ఆదివారం కావడంతో సరదాగా గడిపేందుకు ఇక్కడికి వచ్చారు. జలపాతం వద్ద కొలనులో స్నానం చేస్తుండగా, లోతు, ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఏడుగురు గల్లంతయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ వారిని రక్షించే ప్రయత్నం చేసింది. ఏడుగురిలోంచి ఇద్దరిని రక్షించి, బయటకు తీశారు. వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆ ఇద్దరిలో ఒకరు అప్పటికే మరణించారు. మరొకరికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.

Tamil Nadu: బస్సు ఫుట్‌బోర్డ్‌పై నుంచి పడి తొమ్మిదో తరగతి బాలుడు మృతి

గల్లంతైన మిగతా ఐదుగురి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఐదుగురి మృతదేహాల్ని అధికారులు వెలికితీశారు. తాజా ఘటన నేపథ్యంలో ఈ ప్రదేశంలో రక్షణ చర్యలు చేపడుతామని అధికారులు తెలిపారు.