JEE Advanced New Syllabus : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు కొత్త సిలబస్‌

ఐఐటీల్లో ప్రవేశాల కోసం వచ్చే ఏడాది నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు సిలబస్‌ మారింది. మొత్తం మూడు సబ్జెక్టుల(ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌)కు జాయింట్‌ అడ్మిషన్స్‌ బాడీ (జేఏబీ) కొత్త సిలబస్‌ను రూపొందించి jeeadv.ac.in వెబ్‌సైట్‌లో ఉంచింది.

JEE Advanced New Syllabus : ఐఐటీల్లో ప్రవేశాల కోసం వచ్చే ఏడాది నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు సిలబస్‌ మారింది. మొత్తం మూడు సబ్జెక్టుల(ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌)కు జాయింట్‌ అడ్మిషన్స్‌ బాడీ (జేఏబీ) కొత్త సిలబస్‌ను రూపొందించి jeeadv.ac.in వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇకపై జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మరిన్ని చాప్టర్లు ఉంటాయని, కొత్త సిలబస్‌ జేఈఈ మెయిన్‌కు అనుగుణంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఏటా జేఈఈ మెయిన్‌ పరీక్షలో సత్తా చాటిన విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అనుమతిస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కీలక సబ్జెక్ట్స్‌ ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, కెమిస్ట్రీకి సంబంధించిన సిలబస్‌ను ప్రధానంగా రివైజ్‌ చేశారు. అయితే ఇది 2024 నుంచి అమల్లోకి రానుంది.

Join Indian Army : బీటెక్ డిగ్రీతోపాటు ఆర్మీలో లెఫ్టినెంట్ ఉద్యోగం…ఇంటర్ విద్యార్ధులకు సువర్ణ అవకాశం

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కొత్త సిలబస్‌లో.. మ్యాథ్స్‌లో స్టాటిస్టిక్స్‌ చేర్చారు. ట్రాంగిల్‌ సొల్యూషన్‌ టాపిక్‌ను తొలగించారు. ఫిజిక్స్‌లో సెమీకండక్టర్స్‌, కమ్యూనికేషన్స్‌ విభాగాలు తొలగించారు. వీటి స్థానంలో జేఈఈ మెయిన్‌ సిలబస్‌లో ఉండే ఫోర్స్‌ అండ్‌ డ్యాప్డ్‌ ఆసిలేషన్స్‌, ఈఎం వేవ్స్‌ అండ్‌ పోలరైజేషన్‌ వంటి టాపిక్స్‌ యాడ్‌ చేశారు.

ఇక కెమిస్ట్రీ విభాగంలో గ్యాసెస్‌ అండ్‌ లిక్విడ్స్‌, అటామిక్‌ స్ట్రక్చర్‌, కెమికల్‌ బాండింగ్‌, మాలిక్యులార్‌ స్ట్రక్చర్‌ వంటి టాపిక్స్‌ కవర్‌ కానున్నాయి.

ట్రెండింగ్ వార్తలు