Join Indian Army : బీటెక్ డిగ్రీతోపాటు ఆర్మీలో లెఫ్టినెంట్ ఉద్యోగం…ఇంటర్ విద్యార్ధులకు సువర్ణ అవకాశం

మొత్తం 90 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఫిజక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధులను జేఈఈ మెయిన్స్ 2022 సాధించిన స్కోరు అధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.

Join Indian Army : బీటెక్ డిగ్రీతోపాటు ఆర్మీలో లెఫ్టినెంట్ ఉద్యోగం…ఇంటర్ విద్యార్ధులకు సువర్ణ అవకాశం

joinindianarmy

Join Indian Army :ఇండియన్ ఆర్మీ 10 ప్లస్ 2 ఎంట్రీ స్కీమ్ ప్రకటన జారీచేసింది. ఇంటర్ ఎంపీసీ గ్రూప్ విద్యార్ధులు ఉచితంగా బీటెక్ చదువుతోపాటు లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరే అవకాశం దీని ద్వారా చేజిక్కించుకోవచ్చు. 2023 నుండి బీటెక్ కోర్సు, లెఫ్టినెంట్ కొలువులకు సంబంధించిన శిక్షణ ప్రారంభం కానుంది. మొత్తం 90 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఫిజక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధులను జేఈఈ మెయిన్స్ 2022 సాధించిన స్కోరు అధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ లో ఎంపిక చేసిన వారిని సర్వీస్ సెలక్షన్ బోర్డ్ సైకాలజీ పరీక్షులు, గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.

ఐదురోజుల పాటు జరిగే రెండు దశల పరీక్షల్లో తొలిరోజు స్టేజ్ 1 స్క్రీనింగ్ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి స్టేజ్ 2కి ఎంపిక చేస్తారు. నాలు రోజుల పాటు నిర్వహించే వివిధ పరీక్షల్లో రాణించిన వారిని మాత్రమే శిక్షణకు ఎంపిక చేస్తారు. శిక్షణలో రెండు దశలు ఉంటాయి. ఫేజ్ 1 మూడేళ్ల ప్రీ కమిషన్ ట్రైనింగ్, ఫేజ్ 2 ఏడాది పోస్ట్ కమిషన్ ట్రైనింగ్ ఉంటాయి. మూడేళ్ళ ఫేజ్ 1 శిక్షణ తరువాత అభ్యర్ధులకు నెలకు 56,100 స్టైఫెండ్ గా చెల్లిస్తారు. నాలుగేళ్ల శిక్షణ తరువాత లెఫ్టినెంట్ హోదా కల్పిస్తారు. శిక్షణ పూర్తైన తరువాత జవహర్ లాల్ నెహ్రు యూనివర్శిటీ ఇంజినీరింగ్ బీటెక్ ప్రధానం చేస్తారు. లెవల్ 10 మూల వేతనంగా 56,100, మిలిటరీ సర్వీస్ పే గా 15,500 ప్రతినెల అందుతాయి. వీటితోపాటుగా డీఏ, హెచ్ ఆర్ ఏ, వివిధ ప్రోత్సాహకాలు ఉంటాయి.

అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తుల గడువు సెప్టెంబరు 21గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://joinindianarmy.nic.in పరిశీలించగలరు.