చెక్ ఇట్..JEE MAIN హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి

  • Publish Date - March 20, 2019 / 06:52 AM IST

జేఈఈ మెయిన్ 2019 ఏప్రిల్ సెషన్‌కు సంబంధించిన హాల్‌టికెట్లను బుధవారం (మార్చి 20, 2019) విడుదల చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జేఈఈ మెయిన్ వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లను పొందవచ్చు. జేఈఈ మెయిన్ 2019 పరీక్షకు దేశవ్యాప్తంగా 9.34 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో జనవరిలో నిర్వహించిన జేఈఈ మెయిన్-1 పరీక్ష రాసినవారే 72 శాతం మంది ఉన్నారు. మొదటి విడతగా జనవరిలో నిర్వహించిన పరీక్షలకు దేశవ్యాప్తంగా దాదాపు 6.69 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. 
Read Also : హోళీ ఇలా చేస్తే అద్భుతం: అసలైన హోళీ ఇదే

షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 7 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.  ఏప్రిల్‌లో నిర్వహించనున్న పరీక్షలకు 9.34 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పేపర్‌- 1, 2లకు కలిపి మొత్తం అయిదు రోజులపాటు ఆన్‌లైన్‌ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 7న B-Arch‌, B-Planning లో ప్రవేశానికి పేపర్‌- 2 పరీక్షను; ఏప్రిల్‌ 8, 9, 10, 12 తేదీల్లో BE, B-TECH కోర్సుల్లో ప్రవేశానికి పేపర్‌-1 పరీక్షను నిర్వహించనున్నారు.