JEE Mains 2025 Schedule : జేఈఈ మెయిన్స్ 2025 షెడ్యూల్ ఇదిగో.. మొదటి సెషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం!

JEE Mains 2025 Schedule : జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ పరీక్ష కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఈరోజు నుంచే ప్రారంభమవుతుంది. నవంబర్ 22, 2024 రాత్రి 9 గంటలకు దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.

JEE Mains 2025 schedule out, Session 1 registration

JEE Mains 2025 Schedule : 2025-26 విద్యా సంవత్సరానికిగానూ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ 2025 పరీక్ష షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ జేఈఈ మెయిన్స్ పరీక్షలను జనవరి, ఏప్రిల్‌లలో రెండు సెషన్లలో నిర్వహించనుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అక్టోబర్ 28న ప్రకటించింది. పరీక్ష మొదటి సెషన్ జనవరి 22న జరుగనుండగా, జనవరి 31, 2025 మధ్య నిర్వహించనుంది.

జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ పరీక్ష కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఈరోజు నుంచే ప్రారంభమవుతుంది. నవంబర్ 22, 2024 రాత్రి 9 గంటలకు దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. జేఈఈ అభ్యర్థులు దరఖాస్తు రుసుమును చివరి తేదీ నవంబర్ 22, 2024 రాత్రి 11.50 గంటల వరకు చెల్లించవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా ఈ పరీక్ష ఫీజును చెల్లించవచ్చు.

జేఈఈ మెయిన్స్ పరీక్ష జనవరి 2025 మొదటి వారంలో ప్రకటించనుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లు పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు విడుదల అవుతాయి. జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ ఫలితాలు ఫిబ్రవరి 12, 2025 నాటికి ప్రకటిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్స్ 300 మార్కులకు నిర్వహిస్తారు. కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా నాలుగేళ్ల క్రితం ఆప్షనల్ ప్రశ్నలను తొలగించాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవల ఏజెన్సీ ప్రకటించింది.

2021 నుంచి 2024 మధ్య ఎన్టీఏ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్/ప్లానింగ్ పేపర్‌లలో 30 ఆప్షనల్ ప్రశ్నలను అందించింది. ఇంజినీరింగ్ పేపర్లలో 90 ప్రశ్నలు ఉన్నాయి. అభ్యర్థులు అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్ (jeemain.nta.nic.in)ని సందర్శించాలి. మరింత సమాచారం కోసం అధికారిక ఎన్టీఏ వెబ్‌సైట్ (nta.ac.in)ని చేయాలని అధికారులు సూచించారు.

Read Also : TNPSC Group 4 Results : టీఎన్‌పీఎస్సీ గ్రూప్ 4 రిజల్ట్స్ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!