TNPSC Group 4 Results : టీఎన్‌పీఎస్సీ గ్రూప్ 4 రిజల్ట్స్ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!
TNPSC Group 4 Results 2024 : టీఎన్‌పీఎస్సీ గ్రూప్ 4 ఫలితాలను ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్ (tnpsc.gov.in) ద్వారా రిజిస్ట్రేషన్ నంబర్, లాగిన్ వివరాలతో రిజల్ట్స్ చెక్ చేయవచ్చు.

TNPSC Group 4 Results
TNPSC Group 4 Results 2024 : తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబర్ 28న టీఎన్‌పీఎస్సీ గ్రూప్ 4 ఫలితాలను ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు టీఎన్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ (tnpsc.gov.in) ద్వారా వారి రిజిస్ట్రేషన్ నంబర్, ఇతర లాగిన్ వివరాలను ఉపయోగించి రిజల్ట్స్ చెక్ చేయవచ్చు.
టీఎన్‌పీఎస్సీ గ్రూప్ 4 పరీక్షను క్లియర్ చేసేందుకు అభ్యర్థులు తప్పనిసరిగా 300 మార్కులకు కనీసం 90 మార్కులు సాధించాలి. మూడు గంటల పరీక్షలో 300 మార్కులు ఉంటాయి. ఇందులో జనరల్ స్టడీస్, ఆప్టిట్యూడ్, మెంటల్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులపై ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, ఎస్ఎస్ఎల్‌సీ లేదా క్లాస్ 10 స్థాయికి సంబంధించిన ఇతర నిర్దిష్ట సబ్జెక్టులు ఉంటాయి. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1.5 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు.
టీఎన్‌పీఎస్సీ గ్రూప్ 4 2024 రిజల్ట్స్ ఎలా చెక్ చేయాలి? :
- టీఎన్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ (tnpsc.gov.in)కి లాగిన్ చేయండి.
- హోమ్‌పేజీలో, రిజల్ట్స్ సెక్షన్‌పై క్లిక్ చేయండి.
- “గ్రూపు IV సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ 2024” లింక్ క్లిక్ చేయండి.
- మెరిట్ జాబితాను కలిగిన పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసి ఓపెన్ చేయండి.
- డాక్యుమెంట్‌లో మీ రోల్ నంబర్‌ను సెర్చ్ చేయండి. అర్హత స్టేటస్ చెక్ చేయండి.
వివిధ తమిళనాడు ప్రభుత్వ ఏజెన్సీల్లో దాదాపు 6వేల గ్రూప్ 4 పోస్టులకు జూన్ 9న రిక్రూట్‌మెంట్ పరీక్ష జరిగింది. టీఎన్‌పీఎస్సీ తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం వివిధ పరీక్షలను నిర్వహిస్తుంది. గ్రూప్ 4 పరీక్షలో జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్, విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (VAO), టైపిస్ట్ మరెన్నో స్థానాలకు అభ్యర్థులను నియమిస్తారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 7,247 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు దాదాపు 15.8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
జూన్ 18న టీఎన్‌పీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించిన ఆన్సర్ కీ విడుదల చేయగా, అభ్యర్థులు అభ్యంతరాలుంటే తెలియజేసేందుకు జూన్ 25 వరకు 7 రోజుల గడువు ఇచ్చారు. 10వ తరగతి బోర్డు పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు వయోపరిమితి సాధారణంగా 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుంది. అయితే, రిజర్వ్ చేసిన కేటగిరీ అభ్యర్థులకు సడలింపులు ఉన్నాయి.
Read Also : iPhone SE 4 Launch : ఆపిల్ ఐఫోన్ SE 4 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?