Job Mela on August 21 at Government Women's College, Gudur, Tirupati
Job Mela : నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తిరుపతి జిల్లాలోని గూడూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా జరుగనుంది. ఆగస్టు 21వ తేదీన జరుగనున్న ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి.
ఈ జాబ్ మేళా ద్వారా దాదాపు 580 పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కాబట్టి, నిరుద్యోగ యువతీ, యువకులు ఇది బంగారంలాంటి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ జాబ్ మేళా(Job Mela)లో పాల్గొని మంచి ఉద్యోగాన్ని పొందవచ్చు. ఈ జాబ్ మేళా గురించి ఇంకా ఏదైనా సమాచారం కోసం 9186398359 నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
సంస్థలు, ఉద్యోగ వివరాలు:
బిగ్ సి మొబైల్స్ లో 20 ఉద్యోగాలు
శ్రీరామ్ లైఫ్ ఇష్యురెన్స్ లో 20 ఉద్యోగాలు
టీంలీజ్ లో 30 ఉద్యోగాలు
డిక్సన్ టెక్నాలజీస్ లో 50 ఉద్యోగాలు
హీరో మోటోలో 30 ఉద్యోగాలు
ఐ మెర్క్యూ సొల్యూషన్స్ లో 50 ఉద్యోగాలు
ఫోర్ట్ మేనేజ్మెంట్ లో 30 ఉద్యోగాలు
అల్త్రుఇస్త్ టెక్నాలజీస్ లో 30 ఉద్యోగాలు లో
అమర రాజా లో 50 ఉద్యోగాలు లో
TVS బ్రేక్స్ ఇండియాలో 30 ఉద్యోగాలు
గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ లో 30 ఉద్యోగాలు
నేల్క్యాస్ట్ లో 30 ఉద్యోగాలు
MRFలో 50 ఉద్యోగాలు
అరబిందో పార్మాలో 30 ఉద్యోగాలు
యంగ్ మైండ్స్ టెక్నాలజీస్ లో 50 ఉద్యోగాలు ఉన్నాయి.
కాబట్టి యువత తప్పకుండ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అధికారులు.
NEET PG Results: నీట్ 2025 పీజీ రిజల్ట్స్ అప్డేట్.. కటాఫ్ పర్సెంటైల్ ఎంతో తెలుసా?