Indian Army Jobs : ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టుల అధారంగా పదో తరగతి, ఇంటర్వీడియట్ , బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 ఏళ్ల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

Indian Army Jobs : ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల భర్తీ

Army Jobs

Updated On : May 16, 2022 / 2:31 PM IST

Indian Army Jobs : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆర్మీ పరిధిలోని వెస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ పరిధిలో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రూప్ సీ సివిలియన్ పోస్టుల భర్తీకి గాను తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి లైబ్రేరియన్, స్టెనో గ్రేడ్ 2, ఎల్ డీసీ, ఫైర్ మెన్, మెసెంజర్, బార్బర్, వాషర్ మెన్, రేంజ్ చౌకీదార్, డాప్ట్రీ వంటి పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టుల అధారంగా పదో తరగతి, ఇంటర్వీడియట్ , బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 ఏళ్ల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాత పరీక్ష అధారంగా ఎంపిక పక్రియ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి పోస్టుల అధారంగా నెలకు 18,000రూ నుండి 1,12,400రూ వరకు చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://indianarmy.nic.in/ పరిశీలించగలరు.