Andhra SSC Results Date : విద్యార్థులకు అలర్ట్..! ఏప్రిల్ 22 లేదా 23న పదో తరగతి ఫలితాలు..!

6.24 లక్షల మంది విద్యార్థులకు గాను 6.17 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

Andhra SSC Results Date : ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ ముగిశాయి. జవాబు పత్రాల మూల్యాంకనం కూడా జరుగుతోంది. రిజల్ట్స్ కోసం విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఫలితాలు వస్తాయా అని వెయిట్ చేస్తున్నారు. పదో తరగతి ఫలితాలు ఎప్పుడు విడుదల కానున్నాయి అనేది తెలియాల్సి ఉంది. కాగా, టెన్త్ రిజల్ట్స్ ఏప్రిల్ 22న లేదా 23వ తేదీన విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏప్రిల్ 22 లేదా 23వ తేదీల్లో పదో తరగతి ఫలితాలు రిలీజ్ కావ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

జవాబు పత్రాల వాల్యుయేషన్ ఏప్రిల్‌ 3న ప్రారంభమైంది. 9వ తేదీ వరకు మూల్యాంకన ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈసారి రికార్డ్ స్థాయిలో వీలైనంత ముందుగానే ఫలితాలను వెల్లడించాలన్న యోచనలో ప్రభుత్వం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే ఏప్రిల్‌ నెలాఖరులోపే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందంటున్నారు.

Also Read : ఐడీబీఐ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి..

మార్చి 17న ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 1వ తేదీతో పరీక్షలు ముగిశాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. 6.24 లక్షల మంది విద్యార్థులకు గాను 6.17 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఏప్రిల్ 3న ప్రారంభమైన జవాబు పత్రాల మూల్యాంకనం 9వ తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత పలు దఫాల పరిశీలన ఉంటుందని.. అనంతరం ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.