LIC Recruitment 2025 Life Insurance Corporation releases notification for AEO and AE posts
LIC Recruitment 2025: నిరుద్యోగులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ)(LIC Recruitment 2025) సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థలో ఖాళీగా ఉన్న 841 ఏఏఓ, ఏఈ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా సెప్టెంబర్ 8తో గడువు ముగియనుంది. కాబట్టి, ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ licindia.in ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అసిస్టెంట్ ఇంజినీర్స్ పోస్టులు 81
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు 410
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు 350
ఏఏఓ (జనరలిస్ట్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
Diabetes In Children: పిల్లల్లో డయాబెటీస్ ప్రమాదం.. ఈ 5 రకాల ఫుడ్ తో మొత్తం కంట్రోల్ చేయొచ్చు
అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ (జనరల్) అభ్యర్థులకు 10 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ (ఎస్సీ/ఎస్టీ) అభ్యర్థులకు 15 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ (ఓబీసీ) అభ్యర్థులకు 13 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, ఈసీఓ/ఎస్‌ఎస్‌సీఓ (జనరల్) అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, ఈసీఓ/ఎస్‌ఎస్‌సీఓ (ఎస్సీ/ఎస్టీ) అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, ఈసీఓ/ఎస్‌ఎస్‌సీఓ (ఓబీసీ) అభ్యర్థులకు 8 సంవత్సరాలు, ఎల్‌ఐసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు అదనంగా 5 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ. 85, ఇతర అభ్యర్థులు రూ. 700 చెల్లించాల్సి ఉంటుంది.
ఎల్‌ఐసీ రిక్రూట్‌మెంట్ ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటిది ప్రిలిమినరీ పరీక్ష, రెండవది మెయిన్ పరీక్ష, చివరిది ఇంటర్వ్యూ. ఆ తర్వాత మెడికల్ పరీక్ష ఉంటుంది.