Diabetes In Children: పిల్లల్లో డయాబెటీస్ ప్రమాదం.. ఈ 5 రకాల ఫుడ్ తో మొత్తం కంట్రోల్ చేయొచ్చు

Diabetes In Children: చిన్న పిల్లలోనే కాదు, పెద్దల్లో కూడా షుగర్ కంట్రోల్ లో కూరగాయలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాటిలో పాలకూర, ముల్లంగి కూర, బీరకాయ, బ్రొకలీ, క్యాబేజీ, క్యారెట్, కాకరకాయ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.

Diabetes In Children: పిల్లల్లో డయాబెటీస్ ప్రమాదం.. ఈ 5 రకాల ఫుడ్ తో మొత్తం కంట్రోల్ చేయొచ్చు

5 foods that control diabetes in children

Updated On : August 17, 2025 / 6:20 PM IST

ఈ ఆధునిక యుగంలో పిల్లల్లో మధుమేహం (డయాబెటీస్) సంఖ్య పెరుగుతోంది. పెద్ద వయస్కుల్లో ఎక్కువగా కనిపించిన ఈ మహమ్మారి ఇప్పుడు పిల్లలను కూడా వదలడం లేదు. దానికి చాలా రకాల కారణాలే ఉన్నాయి. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి లాంటివి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఫలితంగా పిల్లల్లో షుగర్ సమస్య అధికమవుతోంది. షుగర్ కంట్రోల్ లో ఆహారపు అలవాట్లు ప్రధానం. అందుకే, చిన్న పిల్లలో షుగర్ కంట్రోల్ కోసం తీసుకోవాల్సిన 5 రకాల ఆహార పదార్థాలు గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1.కూరగాయలు:

చిన్న పిల్లలోనే కాదు, పెద్దల్లో కూడా షుగర్ కంట్రోల్ లో కూరగాయలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాటిలో పాలకూర, ముల్లంగి కూర, బీరకాయ, బ్రొకలీ, క్యాబేజీ, క్యారెట్, కాకరకాయ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. ఫైబర్ అధికంగా ఉండి, జీర్ణక్రియ మెరుగుపరుస్తాయి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా అందుతాయి.

2.ఫలాలు:

షుగర్ పేషేంట్స్ తీపి తక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. వాటిలోజామపండు, యాపిల్, నేరేడు, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, నారింజ వంటివి తీసుకోవడం మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ పండ్లు ప్రకృతి స్వభావమైన తీపిని కలిగి ఉండి షుగర్‌ స్థాయిలు పెరిగేలా చేయవు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ C వంటివి ఇమ్యూనిటీని పెంచుతాయి. కానీ, అరటి, మామిడి, ద్రాక్ష వంటి ఫలాలు అస్సలే తినకూడదు.

3.తక్కువ గ్లైసెమిక్ ఉండే ధాన్యాలు:

షుగర్ పేషేంట్స్ మిలెట్స్, బ్రౌన్ రైస్, ఓట్స్, గోధుమ రవ్వ ఎక్కువగా తినాలి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండి, చక్కెర స్థాయిని నెమ్మదిగా పెంచుతుంది. కడుపు నిండిన భావన కలిగించి అధిక భోజనం చేయకుండా అడ్డుకుంటుంది.

4.గింజలు, విత్తనాలు:

మధుమేహం ఉన్నవారు బాదం, వేరుశనగ, చియ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సనగపప్పు ఎక్కువగా తినాలి. వీటిలో మంచి కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్‌ ఉంటుంది. ఇవి బ్లడ్ షుగర్ స్థాయిని నిలకడగా ఉంచుతాయి. పిల్లల్లో శక్తిని పెంచుతాయి

5.ప్రోటీన్‌ పదార్థాలు:

షుగర్ ఉన్న పిల్లలు ఎక్కువగా ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. మొక్కజొన్న, పనీర్, టోఫు, ఉడికించిన గుడ్లు, తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు తీసుకోవాలి. ముద్దపప్పు, శెనగపప్పు తినాలి. వీటిలో ఉండే ప్రోటీన్ శరీరానికి బలాన్ని ఇస్తుంది. ఇన్సులిన్‌కు శరీరం స్పందించే తీరును మెరుగుపరుస్తుంది.