LIC Scholarship: LIC 40 thousand scholarship scheme for poor students
LIC Scholarship: ఉన్నత విద్య చదవాలని కోరిక ఉంది ఆర్ధిక స్థోమత లేక బాధపడుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు గుడ్ న్యూస్. ఎల్ఐసీ గోల్డెన్ జూబిలీ స్కాలర్‌షిప్ స్కీమ్ ద్వారా రూ.40 వేల ఆర్థక సహాయం అందిస్తోంది. ఇందుకోసం విద్యార్థులు నుండి దరఖాస్తులను కోరుతోంది. ప్రభుత్వాలు, ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మెడిసిన్, ఇంజినీరింగ్, డిగ్రీ, డిప్లొమా(LIC Scholarship), వొకేషనల్ ట్రైనింగ్ కోర్సులు చదువుతున్న విద్యార్థులుల్ సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ http://www.licindia.in లోకి వెల్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఇక ఎల్ఐసి స్కాలర్‌షిప్ రెండు విధాలుగా ఉంటుంది. మొదటిది జనరల్ స్కాలర్‌షిప్. రెండోది ప్రత్యేకంగా అమ్మాయిల కోసం మాత్రమే. టెక్నికల్, వొకేషనల్ కోర్సుల, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్‌సివిటి) గుర్తించిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు, సెంటర్లలో చదివేవాళ్లు, ఇంటర్ తర్వాత చేసీ సంయుక్త కోర్సులకు ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది.
Railway Jobs: పది పాసైన వారికి రైల్వేలో జాబ్స్.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు
అర్హతలు:
12 వ తరగతి తరువాత వారికి:
* 2022-23, 2023-24 లేదా 2024-25లో 12వ తరగతి లేదా డిప్లొమా 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* మెడిసిన్, ఇంజినీరింగ్, ఏదైనా డిగ్రీ కోర్సు, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, డిప్లొమా, వొకేషనల్ కోర్సులు, ఐటీఐ/ దానితో సమానమైన కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి.
* తల్లిదండ్రులు/ గార్డియన్ వార్షిక ఆదాయం రూ.4,50,000 మించకూడదు.
10వ తరగత తరువాత వారికి:
* 2022-23, 2023-24 లేదా 2024-25లో 10వ తరగతి 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* వొకేషనల్ కోర్సులు, డిప్లొమా కోర్సులు, ఐటీఐ కోర్సుల్లో మొదటి సంవత్స్రరం చదువుతూ ఉండాలి.
* తల్లిదండ్రులు /గార్డియన్ వార్షిక ఆదాయం రూ.4,50,000 మించకూడదు.
ప్రత్యేకంగా అమ్మాయిలకు సంబందించిన స్కాలర్షిప్ కోసం:
* 2022-23, 2023-24 లేదా 2024-25లో 10వ తరగతి 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ / 10+2 ప్యాటర్న్, వొకేషనల్ కోర్సులు, డిప్లొమా కోర్సులు, ఐటీఐ కోర్సులు మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి.
* తల్లిదండ్రుల / గార్డియన్ వార్షిక ఆదాయం రూ.4,50,000 మించకూడదు.
ఈ స్కాలర్షిప్ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి: