Telugu » Education-and-job » Mca Extends Pm Internship Scheme 2025 Registration Deadline To March 31 Sh
PM Internship Scheme 2025 : యూత్‌కి అద్భుత అవకాశం.. ఇంటర్న్ షిప్ గడువు 31 వరకే.. ఇలా అప్లయ్ చేయండి..!
PM Internship Scheme 2025 : MCA PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2025 రిజిస్ట్రేషన్ గడువును మార్చి 31 వరకు పొడిగించింది. అర్హత ఉన్న అభ్యర్థులు వివిధ రంగాలలో ఇంటర్న్‌షిప్‌లకు అప్లయ్ చేసుకోవచ్చు.
PM Internship Scheme 2025 : యువతకు అద్భుత అవకాశం. పీఎం ఇంటర్న్‌షిప్ పొందడానికి లాస్ట్ ఛాన్స్.. పీఎం ఇంటర్న్‌షిప్ 2025 రెండో దశ దరఖాస్తు ప్రక్రియ మార్చి 31, 2025న ముగుస్తుంది. మీరు ఇంకా అప్లయ్ చేసుకోలేదా? అయితే ఇప్పుడే అప్లయ్ చేసుకోండి. అధికారిక వెబ్‌సైట్ (pminternship.mca.gov.in) విజిట్ చేసి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. రెండో దశ పీఎం ఇంటర్న్‌షిప్‌లో మొత్తం ఒక లక్ష మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
గతంలో దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 12, 2025 ఉండగా, ఇప్పుడు మార్చి 31, 2025 వరకు పొడిగించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాన్ మంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ (PMIS) యాప్‌ను ప్రారంభించారు. ఈ దశలో యువత వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, దేశంలోని టాప్-500 కంపెనీలలో ఇంటర్న్‌షిప్‌లను ప్రారంభించవచ్చు.
ఈ సువర్ణవకాశాన్ని పొందేందుకు ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్‌లో మీ ప్రొఫైల్ వివరాలతో వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. పీఎం ఇంటర్న్‌షిప్ పథకంతో భారత్‌లో ఇతర నైపుణ్య అభివృద్ధి, అప్రెంటిస్‌షిప్, ఇంటర్న్‌షిప్, విద్యార్థుల ట్రైనింగ్ స్కీమ్‌లతో సంబంధం లేదు. మొత్తం 12 నెలల పాటు ఈ ఇంటర్న్‌షిప్ ప్రొగ్రామ్ ఉంటుంది.
అభ్యర్థులు హైస్కూల్, హయ్యర్ సెకండరీ స్కూల్, ITI సర్టిఫికేట్, పాలిటెక్నిక్ కాలేజీ నుంచి డిప్లొమా లేదా BA, B.Sc, B.Com, BCA, BBA, B.Pharma మొదలైన డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థులు 21ఏళ్ల నుంచి 24 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.
అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి.
దరఖాస్తుదారులు ఫుల్ టైమ్ జాబ్ చేయకూడదు. ఫుల్ టైమ్ స్టడీ చేస్తూ ఉండకూడదు.
ఆన్‌లైన్ లేదా దూరవిద్య కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల కన్నా ఎక్కువ ఉన్నవారు అర్హులు కారు.
కుటుంబంలోని ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే అర్హులు కారు.
ఏదైనా ప్రభుత్వ పథకం కింద స్కిల్ ట్రైనింగ్ పొందే యువత కూడా అర్హులు కాదు.