×
Ad

MOIL Recruitment 2025: MOILలో ఉద్యోగాలు.. అర్హతలు, ఎంపిక ప్రక్రియ, ఫీజు పూర్తి వివరాలు..

రాతపరీక్ష/ట్రేడ్/ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు.

MOIL Recruitment 2025: మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (MOIL) లో ఉద్యోగాలు పడ్డాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ ప్రైజ్ అయిన MOIL మొత్తం 142 పోస్టులు భర్తీ చేయనుంది. ఐటీఐ పాస్ అయి ఉండాలి. అలాగే పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమైంది. నవంబర్ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలక్ట్రీషియన్, మెకానిక్ కమ్ ఆపరేటర్ (ఫిట్టర్, వెల్డర్) , సెలెక్ట్ గ్రేడ్ మైన్ ఫోర్‌మెన్, మైన్‌మేట్, బ్లాస్టర్ గ్రేడ్ పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. దరఖాస్తు ఫీజు రూ.295. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.moil.nic.in/. వయసు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఆన్ లైన్ లోనే అప్లయ్ చేసుకోవాలి. పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

రాత పరీక్ష / ట్రేడ్ టెస్ట్: ఎలక్ట్రీషియన్, మెకానిక్-కమ్-ఆపరేటర్, బ్లాస్టర్, మైన్ మేట్ వంటి పోస్టులకు, అభ్యర్థులు రాత పరీక్ష లేదా ట్రేడ్ టెస్ట్ రాయాలి.
ఇంటర్వ్యూ (వర్తిస్తే): కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ రౌండ్ నిర్వహించబడుతుంది.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV): రాతపరీక్ష/ట్రేడ్/ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు.
వైద్య పరీక్ష: షార్ట్‌లిస్ట్ చేయబడిన అన్ని అభ్యర్థులు మెడికల్ ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి.

MOIL ఇండియా రిక్రూట్‌మెంట్ 2025.. ట్రైనీలు, మైన్ మేట్స్ కోసం పరీక్షా విధానం ఇలా ఉంటుంది..

ట్రైనీలకు 85 ప్రశ్నలు 85 మార్కులకు ఉంటాయి.
మైన్ మేట్ కి 100 ప్రశ్నలు ఉంటాయి.
పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.

Also Read: ఐబీపీఎస్ SO ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి..