NIT Karnataka Recruitment : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక లో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తుదారుడి వయోపరిమితి 27 సంవత్సరాలు. గరిష్టంగా 33 సంవత్సరాలు ఉండాలి. పోస్ట్ వారీగా వయోపరిమితిని నిర్ణయించారు. సూపరింటెండెంట్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి రూ.9300 నుండి రూ.34800/- గ్రేడ్ పేతో రూ.4200/- జీతం లభిస్తుంది.

NIT Karnataka Recruitment

NIT Karnataka Recruitment : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 112 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో సూపరింటెండెంట్, సీనియర్ టెక్నీషియన్, సీనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Burn Belly Fat : ఈ డ్రింక్స్ తో పొట్ట చుట్టూ కొవ్వు మటుమాయం!

దరఖాస్తు చేసే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సూపరింటెండెంట్ పోస్టుకు అభ్యర్థులు ఏదైనా విభాగంలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ / మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. లేదా కనీసం 50% మార్కులతో లేదా తత్సమాన గ్రేడ్‌తో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి దానికి సమానమైన డిగ్రీని కలిగి ఉండాలి. ఇతర పోస్ట్‌ల కు, అభ్యర్థులు కనీసం 50% మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుండి సీనియర్ సెకండరీ (10+2) కలిగి ఉండాలి. లేదా ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి గల ITI కోర్సును కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ / ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ / డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఇక మిగతా పోస్టులకు పనిని బట్టి విద్యార్హతలను నిర్ణయించారు.

READ ALSO : Hair Health : జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించే ఆరోగ్యకరమైన ఆహారాలు ఇవే !

దరఖాస్తుదారుడి వయోపరిమితి 27 సంవత్సరాలు. గరిష్టంగా 33 సంవత్సరాలు ఉండాలి. పోస్ట్ వారీగా వయోపరిమితిని నిర్ణయించారు. సూపరింటెండెంట్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి రూ.9300 నుండి రూ.34800/- గ్రేడ్ పేతో రూ.4200/- జీతం లభిస్తుంది. సీనియర్ టెక్నీషియన్, సీనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్ పోస్ట్‌లకు రూ.5200 నుండి రూ.20200/- జీతం లభిస్తుంది.

READ ALSO : Onion Cultivation : ఖరీఫ్ ఉల్లిసాగులో మెళకువలు.. అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్యం

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)కి హాజరు కావాలి. దీని ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు నైపుణ్య పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీగా 6 సెప్టెంబర్ 2023 నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; nitk.ac.in పరిశీలించగలరు.