NEET PG Counselling 2024 : నీట్ పీజీ కౌన్సెలింగ్ 2024.. రౌండ్ 3 రిజిస్ట్రేషన్ డెడ్‌లైన్ పొడిగింపు.. ఎప్పటివరకంటే?

NEET PG Counselling 2024 : నీట్ పీజీ కౌన్సెలింగ్ 2024 మూడో రౌండ్ షెడ్యూల్‌ను సవరించింది. రిజిస్టర్ చివరి తేదీ జనవరి 19 వరకు పొడిగించింది.

NEET PG Counselling 2024

NEET PG Counselling 2024 : మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నీట్ పీజీ కౌన్సెలింగ్ 2024 మూడో రౌండ్ షెడ్యూల్‌ను మళ్లీ సవరించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. రౌండ్ 3 కోసం రిజిస్టర్ చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 19, 2025 వరకు పొడిగించింది. అంతకుముందు, దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 15. ఇప్పుడు ఆప్షన్-ఫిల్లింగ్ ప్రక్రియ జనవరి 20న ముగుస్తుంది. సీట్ల కేటాయింపు ఫలితం జనవరి 21న ప్రకటిస్తారు.

Read Also : Saif Ali Khan : సైఫ్ అలీఖాన్ రాజవంశం అని తెలుసా? అతని ఆస్తులు ఎన్ని కోట్లు..?

మెడికల్ కాలేజీల్లో పీజీ కోర్సుల సీట్లను భర్తీ చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జనరల్ కేటగిరీకి 15 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులకు 10 శాతం కటాఫ్‌ను తగ్గించింది. అర్హులైన, ఇంకా దరఖాస్తు చేసుకోని వారు జనవరి 19లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

మెరిట్ జాబితాలో చేరిన వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ కోసం జనవరి 21 నుంచి 29లోగా కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్‌స్టిట్యూట్‌ల వారీగా డేటా వెరిఫికేషన్ జనవరి 30 నుంచి 31 మధ్య జరుగుతుంది.

నీట్ పీజీ కౌన్సెలింగ్ 2024 కోసం ఎలా దరఖాస్తు చేయాలి? :

  • అధికారిక వెబ్‌సైట్ (mcc.nic.in)ని విజిట్ చేయండి.
  • హోమ్‌పేజీలో, రిజిస్ట్రేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేసి, పీజీ మెడికల్‌ని ఎంచుకోండి.
  • ఇప్పుడు, కోర్సును ఎంచుకుని, నీట్ పీజీ 2024 రోల్ నంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి.
  • దరఖాస్తు ఫారమ్‌ను నింపండి. ఆపై రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి.
  • సమర్పించండి.
  • కన్ఫార్మ్ పేజీని డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.

నీట్ పీజీ కౌన్సెలింగ్ 2024 ప్రవేశానికి అవసరమైన పత్రాలు :

  •  ఎంసీసీ జారీ చేసిన కేటాయింపు లేఖ
  •  ఎన్బీఈ జారీ చేసిన అడ్మిట్ కార్డ్
  •  ఎన్బీఈ జారీ చేసిన రిజల్ట్స్/ర్యాంక్ లెటర్.
  •  ఎంబీబీఎస్/బీడీఎస్ 1వ, 2వ, 3వ ప్రొఫెషనల్ పరీక్షల మార్కు షీట్‌లు.
  •  ఎంబీబీఎస్/బీడీఎస్ డిగ్రీ సర్టిఫికెట్/ప్రొవిజనల్ సర్టిఫికెట్.

నీట్ పీజీ కౌన్సెలింగ్ 2024 : ఆన్‌లైన్ స్ట్రే వేకెన్సీ రౌండ్ షెడ్యూల్ :

50 శాతం ఆల్ ఇండియా కోటా సీట్లు, 100 శాతం డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీలు, ఏఎఫ్‌ఎంఎస్, పీజీ డీఎన్‌బీ సీట్లకు నీట్ పీజీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఎంసీసీ సవరించిన స్ట్రే వేకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా జారీ చేసింది.

ఫిబ్రవరి 4న రివైజ్డ్ సీట్ మ్యాట్రిక్స్ విడుదలైన తర్వాత ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 7 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఎంపిక ఫిల్లింగ్ ప్రక్రియ ఫిబ్రవరి 9న ముగుస్తుంది. సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్స్ ఫిబ్రవరి 11న ప్రకటించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి 22 మధ్య కాలేజల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

Read Also : Planetary Parade 2025 : ఆకాశంలో మహా అద్భుతం.. ఈ నెల 25న అరుదైన ప్లానెట్ పరేడ్.. 6 గ్రహాలు ఒకే వరుసలోకి.. ఎలా వీక్షించాలంటే?