Saif Ali Khan : సైఫ్ అలీఖాన్ రాజవంశం అని తెలుసా? అతని ఆస్తులు ఎన్ని కోట్లు..?
సైఫ్ అలీఖాన్ అందరికి హీరోగానే తెలుసు. కానీ సైఫ్ ఒక రాజవంశస్థుడు కూడా.

Saif Ali Khan Family Background and his Properties Details Here
Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై నేడు ఉదయం ఓ దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ వార్తల్లో నిలిచారు. సైఫ్ అలీఖాన్ అందరికి హీరోగానే తెలుసు. కానీ సైఫ్ ఒక రాజవంశస్థుడు కూడా. సైఫ్ పూర్వికులు గురుగావ్ వద్ద పటౌడీ సంస్థానం నవాబులు. ఇప్పటికి భారీ పటౌడీ ప్యాలెస్ అక్కడ ఉంది. సైఫ్ అలీఖాన్ తాత నవాబ్ ఇఫ్తికార్ అలీఖాన్ ఈ విలాసవంతమైన భవనం పటౌడీ ప్యాలెస్ ని నిర్మించారు. దాని ప్రస్తుత విలువ 800 కోట్లు. ప్రస్తుతం దీన్ని షూటింగ్స్, పెళ్లిళ్లకు రెంట్ కి ఇస్తున్నారు సైఫ్.
సైఫ్ తండ్రి మాజీ క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ. ఆయన కొన్నాళ్ళు కెప్టెన్ గా కూడా చేసారు. సైఫ్ తల్లి ఒకప్పటి స్టార్ హీరోయిన్ షర్మిలా ఠాగోర్. సైఫ్ అలీఖాన్ కు దాదాపు 1200 కోట్ల ఆస్తులు ఉన్నట్టు సమాచారం. సైఫ్ ఒక్కో సినిమాకి 10 నుంచి 15 కోట్లు తీసుకుంటాడు. యాడ్స్ అయితే 2 నుంచి 5 కోట్లు తీసుకుంటాడు. ప్రస్తుతం ముంబై బాంద్రాలో సైఫ్ ఉంటున్న ఇంటి విలువ దాదాపు 55 కోట్లు అని అంచనా. ముంబైలో మరో ఇల్లు కూడా ఉంది సైఫ్ కు. అలాగే స్విట్జర్లాండ్ లో కూడా సైఫ్ కు ఆల్మోస్ట్ 30 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది. ఇక సైఫ్ దగ్గర ఖరీదైన కార్లు 5 ఉన్నాయి. సైఫ్ కు బట్టలు, ఫుట్ వేర్, పర్ఫ్యూమ్స్ విభాగాల్లో బిజినెస్ లు ఉన్నాయి.
Also Read : Saif Ali Khan : అయిదు కార్లు ఉన్నా.. దాడి తర్వాత సైఫ్ అలీఖాన్ ని ఆటోలో హాస్పిటల్ కి తీసుకెళ్లిన తనయుడు..
సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అమ్రితా సింగ్. ఈమె కూడా గతంలో హీరోయిన్ గా సినిమాలు చేసింది. వీరి పిల్లలు సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్. సారా హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ఇబ్రహీం అలీఖాన్ కూడా సినిమాల్లోనే ఉన్నాడు. సైఫ్ అమ్రితాతో విడాకులు అయ్యాక హీరోయిన్ కరీనా కపూర్ ని పెళ్లి చేసుకున్నాడు. కరీనా స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్ళు బాలీవుడ్ ని ఏలింది. ఈమెకు కూడా దాదాపు 500 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని బాలీవుడ్ టాక్. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇక సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. నేడు తెల్లవారుజామున ఓ వ్యక్తి సైఫ్ ఇంట్లో దొంగతనం కోసం ప్రవేశించగా సైఫ్ పట్టుకోవడంతో కత్తితో అతనిపై దాడి చేసి పారిపోయాడు. గాయాలతో రక్తమోడుతున్న సైఫ్ ని అతని కొడుకు ఇబ్రహీం ఆటోలో హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. తెలిసిన వాళ్లే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
Also Read : Saif Ali Khan Attacked : బాలీవుడ్ నటుడు సైఫ్ పై అలీ ఖాన్ దాడి.. 10 కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇవే..