Saif Ali Khan Attacked : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి.. 10 కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇవే..
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన కలకలం రేపుతోంది.

Saif Ali Khan attacked 10 key questions answered
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన కలకలం రేపుతోంది. సైఫ్ ముంబై బ్రాందాలోని తన నివాసంలో ఉండగా ఓ దుండగుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం అతడికి లీలావతి ఆస్పత్రికి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే రెండు శస్త్రచికిత్సలు పూర్తి అయ్యాయి. శస్త్రచికిత్స తరువాత నటుడు బాగానే ఉన్నాడని వైద్యులు ఓ ప్రకటనను విడుదల చేశారు.
దాడి గురించి పలు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. వాటి సమాధాలు ఇలా..
సైఫ్ అలీఖాన్‌పై ఎప్పుడు దాడి జరిగింది?
బాంద్రాలోని తన ఇంటిలో సైఫ్ అలీఖాన్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఆరు సార్లు కత్తితో పొడిచాడు. 54 ఏళ్ల ఈ నటుడు సద్గురు శరణ్ భవనంలోని ఏడవ అంతస్తులో నివసిస్తున్నాడు. గురువారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో సైఫ్ పిల్లల రూమ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
సైఫ్ అలీఖాన్‌పై ఎందుకు దాడి జరిగింది?
కరీనా బృందం విడుదల చేసిన ప్రాథమిక ప్రకటనలో.. దొంగతనానికి ప్రయత్నించడానికి వారి ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి సైఫ్‌పై దాడి చేసినట్లు వెల్లడైంది. అయితే పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు.
సైఫ్ అలీఖాన్‌పై దాడి ఎలా జరిగింది?
బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ తన కుటుంబాన్ని రక్షించేందుకు ప్రయత్నించినప్పుడు దుండగుడు కత్తితో దాడి చేశాడు. పలుమార్లు అతడు సైఫ్ పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ వెన్నముక దగ్గర తీవ్ర గాయమైంది.
Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌ను ‘రియల్ లైఫ్ హీరో’ అని అంటున్న నెటిజన్లు.. ఎందుకంటే?
సైఫ్ అలీఖాన్‌పై దాడి ఎలా జరిగింది?
ముంబై పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఫైర్ ఎస్కేప్ ద్వారా దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడు. నటుడు సైఫ్ అలీ ఖాన్ తన కుటుంబాన్ని రక్షించడానికి ప్రయత్నించినప్పుడు అతను కత్తితో దాడి చేశాడు. పలుమార్లు సైఫ్ చేతిని గాయపరిచాడు. అతడి వెన్నముక దగ్గర గాయమైంది. అనంతరం వైద్యులు మీడియాతో మాట్లాడుతూ నటుడి శరీరంపై లోతైన గాయాలు ఉన్నాయని తెలిపారు.
ఘటన జరిగిన సమయంలో కరీనా కపూర్ ఎక్కడ ఉన్నారు?
సైఫ్ సతీమణి కరీనా, వారి పిల్లలు తైమూర్, జెహ్ వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఘటన జరిగిన సమయంలో వారంతా ఇంట్లోనే ఉన్నారు. ఇండియా టుడే మూలాల ప్రకారం.. కరీనా బుధవారం రాత్రి తన సోదరి కరిష్మా కపూర్, నిర్మాత రియా కపూర్, ఆమె సోదరి, నటి సోనమ్ కపూర్‌లతో కలిసి ఓ పార్టీలో పాల్గొంది. అయితే ఘటన సమయంలో ఆమె, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.
ఇంకా ఎవరైనా గాయపడ్డారా?
మిగిలిన కుటుంబ సభ్యులకు ఎలాంటి గాయాలు కానప్పటికీ, ఇంట్లో ఉన్న మహిళా సిబ్బందిలో ఒకరిపై దాడి జరిగింది. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారు. అనంతరం కేసు విషయమై పోలీసులు ఆమెను ప్రశ్నించారు.
కుటుంబం సురక్షితంగా ఉందా?
సైఫ్ అలీ ఖాన్ కుటుంబం పూర్తిగా సురక్షితంగా ఉంది. కరీనా టీమ్ విడుదల చేసిన ప్రకటన.. అభిమానులకు ఇదే భరోసా ఇచ్చింది. నిన్న రాత్రి సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్‌ల నివాసంలో ఓ దుండగుడు చోరీకి ప్రయత్నించారు. సైఫ్ చేతికి గాయం ఉంది. ప్రస్తుతం సైఫ్ ఆసుపత్రిలో ఉన్నారు. చికిత్స కొనసాగుతోంది. మిగిలిన కుటుంబం క్షేమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అభిమానులు, మీడియా ఓపిక పట్టాలని కోరుకుంటున్నాము అని ఆ ప్రకటనలో ఉంది.
పోలీసులు ఏం చెప్పారు?
ఇంట్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా ఘటన జరగడానికి రెండు గంటల ముందు నుంచి బయటి వ్యక్తులు ఎవరూ కూడా ఇంట్లోకి ప్రవేవించలేదని పోలీసులు గుర్తించారు. అయితే ఫైర్ ఎస్కేప్ ద్వారా దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడని ఆ తర్వాత గుర్తించారు. దుండగుడిని తొలుత కేర్ టేకర్ చూసింది. ఆమె అరుపులు విన్న సైఫ్ అక్కడకు చేరుకున్నాడు. కుటుంబాన్ని రక్షించే క్రమంలో అతడి చేతికి గాయమైంది.
ఈ ఘటనపై డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ దీక్షిత్ మాట్లాడుతూ.. నిన్న రాత్రి నిందితుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఫైర్ ఎస్కేప్ మెట్లను ఉపయోగించి నిందితుడు ఇంట్లోకి ప్రవేశించాడు. అతడు దొంగతనానికి ప్రయత్నించాడు. నిందితుడిని గుర్తించాము. అతడి కోసం పది బృందాలు వెతుకుతున్నాయి అని చెప్పారు.
సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు ఎలా ఉన్నాడు?
గురువారం ఉదయం లీలావతి ఆసుపత్రిలో నటుడికి న్యూరో సర్జరీ జరిగింది. శస్త్రచికిత్సలో అతని శరీరం నుండి 3-అంగుళాల పొడవు పదునైన వస్తువును బయటకు తీశారు. సైఫ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని వైద్యులు ప్రకటించారు. మరో రెండు రోజులు పాటు అతడిని ఐసీయూలో ఉంచనున్నారు. ఆ తరువాత వార్డుకు తరలించనున్నట్లు చెప్పారు.
సైఫ్ అలీఖాన్‌ను ఆసుపత్రిలో ఎవరెవరు పరామర్శించారు?
దాడి వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, పలువురు స్నేహితులు, భార్య కరీనా కపూర్ లు ఆస్పత్రికి చేరుకున్నారు. సైఫ్ పిల్లలు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్, సోదరి సోహా అలీ ఖాన్, ఆమె భర్త కునాల్ కేము లు ఆస్పత్రికి వచ్చారు. సైఫ్‌ను పరామర్శించిన వారిలో చిత్ర నిర్మాత సిద్ధార్థ్ ఆనంద్, అతని భార్య కునాల్ కోహ్లీలు ఉన్నారు.
సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఏం తెలిసింది?
పోలీసుల కథనం ప్రకారం.. సంఘటన జరగడానికి రెండు గంటల ముందు నుంచి ఇంట్లోకి ఎవరూ రాలేదు. దుండగుడు ఇంట్లోకి ఫైర్ ఎస్కేప్ మెట్లను ఉపయోగించి వచ్చాడని తెలిపారు. నిందితుడిని గుర్తించామని, ప్రస్తుతం పది బృందాలు అతడి కోసం వేట కొనసాగిస్తున్నాట్లు తెలిపారు.
గతంలో సైఫ్, కరీనా ఫార్చ్యూన్ హైట్స్‌లో ఉండేవారు. మూడేళ్ల క్రితమే వారు బాంద్రా ప్రాంతంలోని సద్గురు శరణ్ భవనంలో ఉన్న కొత్త ఇంటికి మారారు.