Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌ను ‘రియల్‌ లైఫ్‌ హీరో’ అని అంటున్న నెటిజన్లు.. ఎందుకంటే?

"తన కుటుంబం కోసం ఆయన ఒంటరిగా పోరాటం చేసిన తీరు, వారిని రక్షించుకోవడంలో కనబర్చిన సంకల్పం గొప్పది. రియల్‌ హీరోయిజం మ్యాన్‌.. సెల్యూట్‌.. గెట్‌ వెల్ సూన్‌" అంటూ మరొకరు కామెంట్‌ చేశారు.

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌ను ‘రియల్‌ లైఫ్‌ హీరో’ అని అంటున్న నెటిజన్లు.. ఎందుకంటే?

Saif Ali Khan

Updated On : January 16, 2025 / 2:42 PM IST

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘ‌ట‌న‌ కలకలం రేపుతోంది. దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్‌ ప్రదర్శించిన ధైర్య, సాహసాల గురించి తెలుసుకుని ఆయనను సోషల్ మీడియాలో “రియల్‌ లైఫ్ హీరో” అంటూ ఫ్యాన్స్‌ ప్రశంసిస్తున్నారు.

నిందితుడు దాడి చేస్తున్న సమయంలో సైఫ్‌ అలీఖాన్‌ తన కుటుంబాన్ని రక్షించుకునే క్రమంలోనే ఆయనకు కత్తిపోట్లు దిగాయని, అందుకే ఆయన రియల్‌ లైఫ్ హీరో అని ఫ్యాన్స్‌ అంటున్నారు.

“తన పిల్లలను రక్షించుకుని సైఫ్‌ అలీఖాన్‌ తీవ్రగాయాలపాలయ్యాడు. ట్రూ రియల్‌ లైఫ్‌ హీరో” అని కొందరు కామెంట్లు చేశారు. అలాగే, “తన పనిమనిషిని కూడా సైఫ్ అలీఖాన్ రక్షించుకున్నాడు. ఆయన గొప్ప స్టార్‌” అని మరొకరు ట్వీట్‌ చేశారు.

కాగా, నిందితుడు సైఫ్ అలీఖాన్‌ ఇంట్లో చోరీ చేయడానికి వచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు ఇప్పటికే ఆయన టీమ్‌ ప్రకటించింది.

కాగా, సైఫ్‌ అలీఖాన్‌ పనిమనిషిని పోలీసులు విచారిస్తున్నారు. సైఫ్ అలీఖాన్‌ ఇంట్లోని పనిమనిషికి నిందితుడు ముందే తెలుసని ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె సాయంతో నిందితుడు ఇంట్లోకి వచ్చి ఉండని భావిస్తున్నారు. పనిమనిషిని విచారించాక మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ఏడు స్థానిక పోలీసుల టీమ్స్‌ పనిచేస్తున్నాయని జాతీయ మీడియాకు పోలీసు వర్గాలు చెప్పాయి.

Saif Ali Khan : సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసింది తెలిసిన వాడేనా..?