Saif Ali Khan : అయిదు కార్లు ఉన్నా.. దాడి తర్వాత సైఫ్ అలీఖాన్ ని ఆటోలో హాస్పిటల్ కి తీసుకెళ్లిన తనయుడు..
సైఫ్ అలీఖాన్ ని అతని తనయుడు ఇబ్రహీం అలీఖాన్ ఆటోలో హాస్పిటల్ కి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది.

Ibrahim Ali Khan Carry Saif Ali Khan to Hospital in Auto after Attack
Saif Ali Khan : ఇవాళ తెల్లవారుజామున బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై ఓ దుండగుడు కత్తితో దాడి చేసి తప్పిచుకొని పారిపోయిన సంగతి తెలిసిందే. దొంగతనం కోసం వచ్చి సైఫ్ కి దొరికిపోవడంతో అతను దాడి చేసి పారిపోయాడని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ దుండగుడు ఎవరో కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు.
అయితే సైఫ్ అలీఖాన్ ని అతని తనయుడు ఇబ్రహీం అలీఖాన్(Ibrahim Alikhan) ఆటోలో హాస్పిటల్ కి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో ఇబ్రహీంతో పాటు ఇంట్లో పనిచేసే మరో వ్యక్తి కలిసి ఆటోలో హాస్పిటల్ కి తీసుకువచ్చినట్టు పోలీసులు తెలిపారు. దాడి అనంతరం సైఫ్ అరుపులతో వచ్చిన కొడుకు రక్తంతో ఉన్న తండ్రిని చూసి వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి కిందకు తీసుకొచ్చి ఆటోలో తమ ఇంటికి దగ్గర్లో ఉన్న లీలావతి హాస్పిటల్ కి తీసుకెళ్లినట్టు సమాచారం.
Also Read : Saif Ali Khan Attacked : బాలీవుడ్ నటుడు సైఫ్ పై అలీ ఖాన్ దాడి.. 10 కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇవే..
సైఫ్ అలీఖాన్ దగ్గర అయిదు ఖరీదైన కార్లు ఉన్నాయి. కానీ సమయానికి డ్రైవర్స్ లేకపోవడం, సెల్ఫ్ డ్రైవింగ్ చేద్దామన్నా కార్స్ సెల్లార్ లో పార్కింగ్ లో ఉండటంతో, అత్యవసర స్థితి కావడంతో బయటకు రాగానే కనపడిన ఆటోని పిలిచి ఇబ్రహీం తన తండ్రి సైఫ్ ని ఆటోలో ఎక్కించుకొని హాస్పిటల్ కి తీసుకెళ్లినట్టు సమాచారం. దాడి జరిగిన కొన్ని క్షణాల తర్వాత అపార్ట్మెంట్ ముందు ఆటో ఉండగా కరీనా మాట్లాడుతున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నేడు తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో ఓ వ్యక్తి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించాడని, సైఫ్ అతన్ని పట్టుకోడానికి ప్రయత్నించడంతో అతను సైఫ్ ని గాయపరిచి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. ఇక సైఫ్ కి ఆరు చోట్ల గాయాలు అవ్వగా మెడపై, వెన్నెముకలో తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వైద్యులు శస్త్ర చికిత్స చేస్తున్నారు. సైఫ్ కి అయితే ఏ ప్రమాదం లేదని ఇప్పటికే వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ కేసుని విచారిస్తున్నారు. దాడి చేసిన వ్యక్తికి ఇంట్లో సిబ్బందితో సంబంధం ఉందని అనుమానిస్తూ ఇంట్లో సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు.
Also Read : Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌ను ‘రియల్ లైఫ్ హీరో’ అని అంటున్న నెటిజన్లు.. ఎందుకంటే?