NEET UG 2024 Round 1 Counselling Results To Be Out On August 23 ( Image Source : Google )
NEET UG 2024 Counselling : నీట్ యూజీ 2024 రౌండ్ 1 కౌన్సెలింగ్ ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ మొదటి రౌండ్ ఫలితాలను ఆగస్టు 23న రిలీజ్ చేయనుంది. సీట్లు కేటాయించిన అభ్యర్థులు ఈ సమయంలో వారి సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
డాక్యుమెంట్ వెరిఫికేషన్, అడ్మిషన్ ప్రాసెస్ కోసం ఆగస్టు 24 నుంచి ఆగస్టు 29కు జరుగుతుంది. వెరిఫికేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లను తీసుకురావాలి. అడ్మిషన్ ప్రక్రియను కన్ఫార్మ్ చేసేందుకు అన్ని సీట్లు భర్తీ అయ్యేయో లేదో చెక్ చేసుకోవాలి. అభ్యర్థులు అప్‌డేట్‌లు, తదుపరి మార్గదర్శకాలకు అధికారిక ఎమ్‌సీసీ వెబ్‌సైట్‌ను తరచుగా చెక్ చేసుకుంటుండాలి.
నీట్ యూజీ 2024 రౌండ్ 1 కౌన్సెలింగ్ ఫలితాలు : ఫలితాలను చెక్ చేయండిలా :
నీట్ అభ్యర్థులు ఎమ్‌సీసీ అందించిన అధికారిక సమాచార బ్రోచర్‌ను రిఫర్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లలో కేటాయించిన కాలేజీలకు రిపోర్టు చేయడంతో సహా రిజల్ట్స్ ప్రకటన తర్వాత అనుసరించాల్సిన విషయాలను పాటించాలి.
వెరిఫికేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు :
ధృవీకరణ ప్రక్రియ కోసం అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కింది డాక్యుమెంట్లను వెంట తీసుకురావాలి :
రౌండ్ 2 కౌన్సెలింగ్ రిజిస్టర్ :
నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ రౌండ్ 2 కోసం రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 5న ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 10 వరకు కొనసాగుతుంది. నీట్ యూజీ 2024 కోసం మొత్తం నాలుగు రౌండ్ల కౌన్సెలింగ్ ఉంటుంది. ఇందులో 15శాతం ఆల్ ఇండియా కోటా సీట్లు ఉన్నాయి. ఇందులో సెంట్రల్ యూనివర్శిటీలు, ఏఐఐఎమ్ఎస్, జేఐపీఎమ్ఈఆర్ భారత్‌లోనే ఇతర వైద్య సంస్థలలో కూడా సీట్లు ఉంటాయి.
Read Also : WhatsApp Voice Note : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై వాయిస్ నోట్ ట్రాన్స్‌స్ర్కిప్ట్ చేయొచ్చు!