NMDC Recruitment : ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ హైదరాబాద్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా బ్యాచిలర్‌ డిగ్రీ, సీఏ (ఇంటర్)/ ఐసీడబ్ల్యూఏ- సీఎంఏ (ఇంటర్), బీఈ, బీటెక్‌, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 32 ఏళ్లు మించకూడదు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

NMDC Recruitment : ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ హైదరాబాద్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

NMDC Limited is filling multiple job vacancies in Hyderabad

Updated On : January 29, 2023 / 3:38 PM IST

NMDC Recruitment : హైదరాబాద్‌లోని ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 42 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) ట్రైనీ 11, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (మెటీరియల్స్ & పర్చేజ్) ట్రైనీ 16, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (పర్సనల్ & అడ్మినిస్ట్రేషన్) ట్రైనీ 15 ఖాళీలు ఉన్నాయి.

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా బ్యాచిలర్‌ డిగ్రీ, సీఏ (ఇంటర్)/ ఐసీడబ్ల్యూఏ- సీఎంఏ (ఇంటర్), బీఈ, బీటెక్‌, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 32 ఏళ్లు మించకూడదు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు 17 ఫిబ్రవరి 2023ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.nmdc.co.in. పరిశీలించగలరు.